Yuvraj Singh: ఇండియన్ క్రికెట్లో దశాబ్దాల పాటు కెరియర్ ను కొనసాగించి ఎన్నో మైలురాళ్లను క్రియేట్ చేశాడు క్రికెటర్ యువరాజ్ సింగ్. 2007 t20 వరల్డ్ కప్ మరియు 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో తనదైన పాత్ర పోషించి దేశానికి వరల్డ్ కప్ అందించిన వీరుడు యువరాజ్. ఇవి మాత్రమే కాకుండా తన పేరు మీద ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఆటలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కున్న యువరాజ్ కెరియర్ చివరి అంకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు.
Yuvraj Singh’s Life Story to Be Told in Upcoming Biopic
యువరాజ్ అటు ఆరోగ్యంపరంగా ఇటు ఆటపరంగా జీవితంలో ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే వచ్చాడు. అందుకే కాబోలు ఈ క్రికెట్ హీరో కథ త్వరలోనే వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ను రూపొందించడానికి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ ముందుకు రాగా ఈ విషయాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్, రవి బాగ్ చందక్ అనౌన్స్ చేశారు. అయితే ఈ బయోపిక్ ను అనౌన్స్ చేశారు కానీ ఇందులో ఎవరు హీరోగా నటిస్తారు ఏ ఏ పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంచారు.
Also Read: The Goat: విజయ్ కి తెలుగు లో క్రేజ్ తగ్గిందా.. సర్ రంగంలోకి దిగాల్సిందే!!
ఇప్పటికే పలువురు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. క్రికెట్ అంటే దేశవ్యాప్తంగా చూస్తారు కాబట్టి తప్పకుండా ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. ఒక మంచి బయోపిక్ సినిమాకు కావలసిన కంటెంట్ యువీ జీవితంలో ఉన్నాయి. క్యాన్సర్ తో పోరాడి తిరిగి క్రికెట్లోకి వచ్చిన యువరాజ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఒక దశలో రక్తం కారుతున్న కూడా మైదానంలో ప్రత్యర్థులతో పోరాడి జట్టుకి కావలసిన విజయాలను అందించాడు. అందుకే ఆయన బయోపిక్ ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుందని దేశంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.
ధోని తర్వాత క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయాయి. సచిన్ బయోపిక్ పర్వాలేదనిపించగా, 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అలరించలేదు. మరి చాలా రోజుల తర్వాత రాబోతున్న ఈ బయోపిక్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చిత్ర బృందం ప్రకటించనుంది.