సంక్రాంతి 2026 Release for NTR-Prashanth Neel Film

NTR-Prashanth Neel Film: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రీక్వెల్ లేదా సీక్వెల్ కాదు, ఒక స్టాండ్ అలోన్ చిత్రంగా ఉండనుందని తాజా సమాచారం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ కథ సిద్ధం చేశారని, ఇందులో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి, అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి 2026 Release for NTR-Prashanth Neel Film

సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రారంభంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం 2025 జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన “దేవర” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, ఆయన పూర్తిగా ఈ చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. “దేవర” పై కూడా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మాత్రం ఇంకాస్త ప్రత్యేకం.

Also Read: Samantha: కొండా సురేఖ వివాదం తర్వాత అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన సమంత!!

హీరోయిన్ గా రుక్మిణి వసంత ను ఫైనల్ చేసినట్టు సమాచారం. “సప్తసాగరాలుదాటి” సినిమాతో గుర్తింపు పొందిన రుక్మిణి, ఇప్పుడు ఎన్టీఆర్ తో జతకట్టడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కొత్త జంట తెరపై ఎలా కనిపిస్తుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రుక్మిణి ప్రస్తుతం తెలుగులో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను చేస్తూ బిజీగా ఉన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన “కేజీఎఫ్”, “సలార్” వంటి చిత్రాల తరువాత ఎన్టీఆర్‌తో చేసే ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.