Heroine: సినిమా హీరోయిన్ల రిలేషన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క అభిమాని లో ఉంటుంది. అయితే చాలామంది హీరోయిన్లు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను రహస్యంగా ఉంచుతారు. కొంతమంది హీరోయిన్లు వాటిని బహిరంగంగానే చెప్పుకుంటారు. అయితే ఎంత దాచి పెట్టాలని చూసినా కూడా ఏదో ఒక విషయంలో వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.ఏదో ఒక దగ్గర హీరోయిన్స్ దొరుకుతూనే ఉంటారు.

Heroine relation with modi finally clarity

అయితే ఓ హీరోయిన్ కూడా చాలా రోజులుగా తన ప్రేమ విషయాన్ని దాచిపెడుతోంది.మరి ఆ హీరోయిన్ ఎవరు..మోడీతో నిజంగానే తన డేటిం విషయాన్ని బయట పెట్టేసిందా అనే విషయం ఇప్పుడు చూద్దాం.. మోడీ అనగానే అందరూ దేశ ప్రధాని మోడీ అనుకుంటారు. ఒకవేళ అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.ఎందుకంటే మోడీ అంటే రాజకీయ నాయకుడు మోడీ కాదు బాలీవుడ్ ఫిల్మ్ రైటర్ రాహుల్ మోడీ .. రాహుల్ మోడీ పేరు చెప్పగానే అందరికీ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూరే గుర్తుకొస్తుంది. (Heroine)

Also Read: Pawan Kalyan: శ్రీజ శిరీష్ ని పెళ్లి చేసుకున్నాక పవన్ కళ్యాణ్ చేసిన పనేంటో తెలిస్తే షాకే.?

ఎందుకంటే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య డేటిం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే చాలా చోట్ల శ్రద్ధా కపూర్,రాహుల్ మోడీతో కలిసి తిరిగి మీడియాలో వైరల్ అయింది.కానీ ఇప్పటివరకు తన ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా అఫీషియల్ గా బయట పెట్టలేదు.ఇక రీసెంట్గా వెకేషన్ కి వెళ్ళిన సమయంలో కూడా ఇద్దరు వేరువేరుగా ఫొటోస్ షేర్ చేశారు. కానీ వెనకాలే ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి శ్రద్దా,రాహుల్ మోడీ ఇద్దరు కలిసి రొమాంటిక్ వెకేషన్ కి వెళ్లారని అందరూ భావించారు.

Heroine relation with modi finally clarity

అయితే తాజాగా శ్రద్ధా కపూర్ పెట్టిన పోస్టుతో ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అని అందరూ క్లారిటీకి వస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. శ్రద్ధా కపూర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ మోడీతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి మనసు ఉంచుకో కానీ నా నిద్ర నాకు తిరిగి ఇచ్చెయ్ అంటూ ఫోటో మీద క్యాప్షన్ పెట్టింది. దాంతో ఇది చూసిన నెటిజన్స్ అందరు శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ లు నిజంగానే ప్రేమలో ఉన్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.(Heroine)