Deepika Padukone: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వేసుకున్న డ్రస్సులు,పెట్టుకునే నగలు, చేతికి పెట్టుకునే వాచ్ ల ధరల గురించి ఎక్కుగా వైరల్ అవుతున్నాయి.అయితే ఏదైనా వెరైటీగా కనిపిస్తే చాలు ప్రతి ఒక్క నెటిజన్ దాన్ని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దాని ధర ఎంత ఉంటుందబ్బా అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Deepika Padukone dress cost

ఇక ప్రయత్నాలు చేయడమే కాదు దానికి సంబంధించిన ధరని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్స్ తో అబ్బా అంత ధరనా అంటూ నోరేళ్లబెట్టేలా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ముంబైలో కల్కి 2898 AD మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. (Deepika Padukone)

Also Read: Poonam kaur: మోసం, కుట్ర తో గెలవడం కంటే ఓటమి మేలు.. టాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

అయితే ఈవెంట్ లో బేబీ బంప్ తో వచ్చిన దీపిక పదుకొనే తన చేతికి పెట్టుకున్న బ్రాస్లెట్ విలువ కోటి 16 లక్షలనే న్యూస్ వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ ఈవెంట్లో దీపిక పదుకొనే వేసుకున్న ఆ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా అంటూ మరో వార్త చక్కర్లు కొడుతుంది.

Deepika Padukone dress cost

మరి ఇంతకీ ఆ డ్రెస్ ఖరీదు ఎంతా అనుకుంటున్నారా..అక్షరాల లక్షా 14000.. అవును మీరు వింటున్నది నిజమే.. ఈ డ్రెస్ కు సంబంధించిన అధికారికి వెబ్ సైట్ లో డ్రెస్ ధర లక్ష 14 వేల రూపాయలు అని ఉంది.. ఇక ఈ ధర తెలిసిన నెటిజన్లు దీపిక వేసుకున్న డ్రెస్ తో బంగారం కొనేయవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Deepika Padukone)