Orange Peel: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. మనం తీసుకునే ఆహారాన్ని చాలా పోషక విలువలు నిండిన నిండే విధంగా తీసుకోవడం మంచిది. అలా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టవచ్చు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చాలామంది ఫ్రూట్స్ తిని వాటిపై ఉండే తొక్కను బయట పడేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఆ తొక్కలతో కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. Orange Peel

health benfits with Orange Peel will check for heat stocks

అలాంటి వాటిలో నారింజపండు ఒకటి. చాలామంది నారింజ పండ్లని తింటూ ఉంటారు. కానీ దాని తొక్కను తీసి పారేస్తారు. నారింజ తొక్క ద్వారా ఉండే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అలా తెలియక దానిని బయట పడేస్తారు. అలా చేయకుండా నారింజ తొక్కను కూడా తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్లకు నారింజ తోక్క తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో చాలా రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నారింజ తొక్కలు లోపల ఉండే గుజ్జు కన్నా ఎక్కువ ఫైబర్, విటమిన్స్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, ఫోలేట్ వివిధ రకాలు ఖనిజాలు ఉండడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. Orange Peel

Also Read: Salt: ఉప్పు తక్కువగా తింటున్నారా..అయితే డేంజర్‌ లో పడ్డట్టే..?

ప్రముఖ ఇరాన్ పరిశోధకుడు ఒక అధ్యయనంలో పరిశోధన చేసి నారింజ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల క్యాన్సర్ ను నిరోధించడానికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పాడు. అంతేకాకుండా నారింజ తొక్కలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగినట్లయితే శరీరం డిహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నారింజ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు నారింజ తొక్కను తీసుకున్నట్లయితే షుగర్ కంటెంట్ తగ్గుతుంది. దీనిని ముఖ్యంగా సలాడ్, స్మూతీల రూపంలో తయారు చేసుకొని కూడా తినవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు నారింజ తొక్కను పేస్టులా చేసుకుని రోజు గోరువెచ్చని నీటిలో ఒక చెంచాడు కలుపుకొని తాగినట్లయితే గుండె సమస్యలు తొలగిపోతాయి. ఇది గుండెకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. Orange Peel

ముఖ్యంగా చిన్నపిల్లలకు విటమిన్స్, పోషకాలు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాసడు నీటిలో ఈ స్మూతీని కలిపి తాగించినట్లయితే చాలా ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవుతారు. నారింజ తొక్క ఆరోగ్యానికే కాకుండా చర్మ రహస్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. నారింజ తొక్కలను ఎండలో ఆరబెట్టి దానిని పొడి చేసుకుని అందులో కాస్త పెరుగు కలుపుకొని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే మొటిమలు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా చర్మం ఎప్పుడు యవ్వనంగా మెరుస్తూ కాంతివంతంగా తయారవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లి ఫేస్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటున్నారు. అలా చేయకుండా ఇంట్లోనే మనం చేసుకోవడం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవడంతోపాటు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే అందంగా తయారవ్వచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. Orange Peel