Vivo T3 Lite 5G: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకటికి మించి రెండు ఫోన్లను వాడుతున్నారు. ఓ దానికి పర్సనల్ అవసరాలకు వినియోగిస్తే…..మరొక మొబైల్ ను ఆఫీస్, బిజినెస్ వంటి పనుల కోసం వాడుతున్నారు స్మార్ట్ ఫోన్లు కూడా అది తక్కువ ధరకే వస్తున్నాయి. Vivo T3 Lite 5G

Vivo T3 Lite 5G mobile rate and features

అందుకు అనుగుణంగా ఆయా కంపెనీదారులు కూడా స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివో కంపెనీ నుంచి మరొక ఫోన్ భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం Vivo సంస్థ Vivo T3 Lite 5G పేరుతో మరో ఫోన్ ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల చివరలో లేదా జులై మొదటి వారంలో ఈ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Vivo T3 Lite 5G

Also Read: Oppo F27 Pro+: వాటర్‌ ప్రూఫ్‌తో ఒప్పో ఎఫ్‌27 ప్రో+.. ధర, వివరాలు ఇవే..!

Vivo T3 Lite ఫోన్ ను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర రూ. 11,999గా ఉండొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. ఈ ఫోన్ ను ఈఎంఐ సదుపాయంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ మనకు రెండు కలర్లలో లభిస్తోంది. క్లాసిక్ బ్లూ, క్రిస్టల్ ఫేక్ కలర్ లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. Vivo T3 Lite ఫోన్ లో ఫోటోలు, వీడియోల కోసం 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రేయిర్ కెమెరాను, 16 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అమర్చారు.Vivo T3 Lite 5G

44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000mAH బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి స్క్రీన్ ను ఇవ్వనున్నారు. 120Hz రిఫ్రెష్ రేటుతో స్క్రీన్ ను అమర్చారు. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ తో రూ. 19,999 రూపాయలు….8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 21,999 లకు Vivo T3 Lite ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం. Vivo T3 Lite 5G