Allu Ramalingaiah: అల్లు రామలింగయ్య.. ప్రస్తుతం ఆయన మన ముందు బతికి లేకపోయినప్పటికీ ఆయన హాస్యం,నటన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలే ఉంటుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు అల్లు రామలింగయ్య హాస్యం,నటన బతికే ఉంటుంది.అయితే అలాంటి రామలింగయ్య బియ్యం దొంగతనం చేసి వాళ్ళ అప్పు తీర్చారట.అయితే వింటుంటే కొంతమందికి షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే వీరిది స్టార్ ఫ్యామిలీ..అలాంటిది దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. మరి దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Allu Ramalingaiah who stole and paid off their debt

అల్లు రామలింగయ్యకు చిన్నతనంలో చదువు అబ్బకపోయేసరికి తండ్రి వ్యవసాయం పనులు చూసుకోమని చెప్పారట.కానీ ఆ పని కూడా చేయకుండా నాటకాలు నాటకాలు అంటూ తిరిగేవారట. అయితే నాటకాల గురించి అంతగా అవగాహన లేకపోయినప్పటికీ ఆయన నాటకాల్లో తన పాత్రకి పూర్తి న్యాయం చేసేవారట. అలా ఓసారి ఊర్లో భక్త ప్రహ్లాద నాటకం ఆడే సమయంలో ఎలాగొలా కష్టపడి ఆ నాటకంలో బృహస్పతి పాత్ర సంపాదించారట.అయితే ఈ పాత చేయడం కోసం కాంట్రాక్టర్ కు మూడు రూపాయలు ఇస్తానని చెప్పారట. (Allu Ramalingaiah)

Also Read: Pawan Kalyan: పొలం కొనడానికి డబ్బులు లేక అలాంటి పని చేసిన పవన్ కళ్యాణ్..?

ఇక ఈ నాటకం పూర్తయి బృహస్పతి పాత్రలో అల్లు రామలింగయ్య నటించాక ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ కి మూడు రూపాయలు ఇవ్వాలి. దాంతో ఏం చేయాలో అర్థం కాక అల్లు రామలింగయ్య తన ఇంట్లో ఉన్న బియ్యాన్ని దొంగతనం చేసి అమ్మేసి మూడు రూపాయలు ఇచ్చారట. అలా నాటకాల మీద ఉన్న పిచ్చితో సొంత ఇంట్లోనే అల్లు రామలింగయ్య దొంగతనం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందట. అలా నాటకాలు చేస్తూ చివరికి పుట్టిల్లు అనే మూవీ తో మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

అలా మొదలైన ఈయన ప్రస్థానం సీనియర్ హీరోల నుండి అప్పటి యంగ్ హీరో అయిన నవదీప్ చేసిన జై మూవీ వరకు కొనసాగింది. ఇక ఈయన చనిపోయే వరకు కూడా సినిమాల్లో కొనసాగారు. అయితే అలాంటి అల్లు రామలింగయ్య కి తన మనవడు అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారడం,తన కూతురికి మెగాస్టార్ చిరంజీవిని భర్తగా రావడం,తన కొడుకు స్టార్ నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం ఎంతో సంతృప్తిని కలిగించిన విషయాలని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.(Allu Ramalingaiah)