Eye: చాలామందికి కళ్ళు మసకగా కనిపిస్తూ ఉంటాయి.ఇవి తగ్గాలంటే ఈ ఆహారాన్ని తప్పకుండా తినాల్సిందే. ఈరోజుల్లో చిన్న వయసులోనే కళ్ళు మసకబారిపోతున్నాయి. మొబైల్, ల్యాప్ టాప్ స్త్రీన్ ఎక్కువసేపు చూడటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. పోషకాహారం లోపం కూడా ఓ కారణం. ఈ కంటి మసకలను తగ్గించాలంటే కొన్ని ఆహారాలను డైట్ లో ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్లలో కోకోశాతం ఎక్కువగా ఉంటుంది.

ఇది కళ్ళలోని కార్నియా ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి రెగ్యలరేగా డార్క్ చాక్లెట్ తీసుకుంటే కంటికి ఎంతో మంచిది. అవకాడో పండ్లలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మస్క్యులార్ డిజనరేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న బీటా కేరోటిన్, విటమిన్ సి, విటమిన్ బి6 కంటికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి గింజలలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే కళ్ళు మసకబారటం సమస్యల నుంచి బయటపడవచ్చు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను తినమని డాక్టర్లు, పెద్దలు చెబుతూ ఉంటారు.

Are the eyes fading?.. Add this food in your daily routine

పాలకూర, బచ్చల కూర, తోటకూర,గోంగూర, టర్నిప్, కొల్లార్ట్ గ్రిన్స్ వంటి ఆకుకూరలు డైట్ లో చేర్చుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. క్యారెట్, బీట్ రూట్, బంగాళదుంప వంటి వాటిలో కేరోటిన్ ఉంటుంది. ఇది కాటరాక్ట్ సమస్య రాకుండా నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు సల్ఫర్, గ్లుట థియోన్ ఉత్పత్తి చేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కోడిగుడ్డులోని ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్, లూటిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్ బి కంటి కణాల ఫంక్షన్ ను మెరుగు పరుస్తుంది. మీరు కూడా ఈ ఆహారాన్ని తప్పకుండా తీసుకోండి కళ్ళు మసకబారక్కుండా ఉంటుంది.