Kalki: డబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రభాస్ కొత్తగా వస్తున్నా మూవీ కల్కి 2898. కల్కి 2898 ఏడి సినిమా నుంచి ‘థిమ్ ఆఫ్ కల్కి’ పాట వచ్చింది. కల్కి అవతారం గురించి వివరిస్తూ ఈ పాట అద్భుతంగా ఉంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి. సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మరో రెండు రోజుల్లో జూన్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టికెట్ల ఆడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. చాలా రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టేలా కనిపిస్తుంది.

Also Read: Eye: కళ్ళు మసగబారుతున్నాయా?.. ఈ ఆహారాన్ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి..!

భారత్ పురాణాల ఆధారంగా దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ కల్కి 2898 ఏడి సైన్స్ ఫిక్షన్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. ఈ చిత్రం నుంచి నేడు (జూన్ 25) థిమే ఆఫ్ కల్కి సాంగ్ వచ్చింది. కల్కి 2898 ఎడి సినిమా నుంచి థిమ్ ఆఫ్ కలిపి పాటను మూవీ టిమ్ నేడు రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటకు మంచి ట్యూన్ ఇచ్చారు. పాటల రచయిత చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారం గురించి వివరించారు. ఈ పాటను కాలభైరవ, అనంతు, గౌతమ్ భారద్వాజ్ ఆలపించారు.

Kalki's theme song bringing goosebumps

కల్కి 2898 ఎడి సినిమాకు తొలిరోజు భారీ ఓపెనింగ్ రావటం ఖాయంగా కనిపిస్తుంది. బుకింగ్ డ్రెండ్ చూస్తే ఇది అర్ధమవుతోంది. ఏ మూవీకి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.200కోట్లు కు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని డ్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. తొలి రోజు రూ.223కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ప్రస్తుతం ఆర్ఆర్ పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి 2 (రూ.214) ఉంది. వీటిని కలిపి 2898 దాటుంతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఎడి సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, సస్వస్త భటర్జి ప్రధాన పాత్రలు పోషించారు. అద్భుతమైన విజువల్స్ తో ఫ్యుచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగ అశ్విన్. సుమారు రూ.600 కోట్లు భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పథకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.(Kalki)