Rohit Sharma: ఫైన‌ల్స్‌ కు టీమిండియా చేరడంతో రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఓపెనింగ్ బ్యాటర్ గా ఈ వరల్డ్ కప్ లో అవసరమైన సమయంలో ఫామ్ ను అందుకున్నారు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ హిట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92 పరుగులు…. ఇప్పుడు సెమీస్ లో ఇంగ్లాండ్ మీద కోట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాలలో చాలా ఆసక్తికరమని చెప్పవచ్చు. కెప్టెన్ గాను రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నాడు. Rohit Sharma

Rohit Sharma gets emotional after India make it to World Cup final, Virat Kohli gesture wins hearts

తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే తనకు అవసరమైన సమయాల్లో బెదిరిస్తూ, ఆరుస్తూ తన సీనియారిటీతో మనందరినీ నవ్విస్తున్నాడు. అలాంటి రోహిత్ శర్మ నిన్న ఏం చేశాడు…….మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లో వారితో పోటీ పడ్డ టీమ్ ను విష్ చేసిన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుండిపోయాడు. వరుసగా ఏడాది కాలంలో రెండవసారి టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్ కు సెమీఫైనల్ చేర్చిన ఎమోషనల్ లో డేసింగ్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. Rohit Sharma

Also Read: Kalki: 6 కోట్ల సినిమా అంటే కల్కి లాగా ఉండాలి.. మరోసారి ఓం రౌట్ నీ ఏకేస్తున్న జనాలు..!

రోహిత్ శర్మను అలా చూసిన కోహ్లీ కాసేపు అక్కడే ఆగి బుజ్జగించే ప్రయత్నం చేశాడు. భుజంపై తట్టి లోపలికి వెళ్ళాడు కోహ్లీ. అక్కడున్నవారు గమనించలేదేమో రోహిత్ శర్మ తన షర్టుతో తుడుచుకోవడం, వస్తున్న బాధను ఆపుకోవడం లాంటివి విజువల్స్ లో అందరికీ కనిపించాయి. పైకి సరదా మనిషిలాగా గంభీరంగా అరుస్తూ, చిరాకుపడుతూ కనిపిస్తాడు. కానీ రోహిత్ ఎంత ఎమోషనల్ పర్సన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Rohit Sharma

2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ సెమీఫైనల్ లో ఓడిపోయిన తర్వాత రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్ ను గుర్తుపెట్టుకుని మరీ కొట్టిన రోహిత్ గుక్క పట్టి ఏడ్చేసాడు. అందుకే ఈసారైనా రోహిత్ శర్మ వరల్డ్ కప్ కొట్టి దేశానికి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా నిలవాలని….ఆ కన్నీళ్ళకు గల ప్రతిఫలాన్ని చేకూర్చాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. Rohit Sharma