Skin: వయసు పెరుగుతున్న కొద్ది అందం తగ్గుతూ వస్తుంది. వయసు పెరిగిన అందం నిత్యంగా ఉండాలంటే ఈ చిట్కాని తప్పక ఫాలో అవ్వండి. మన జీవనశైలి మన అందాన్ని నిర్ణయిస్తుంది. సరైన ఆహారం, యాక్టివ్ జీవనశైలి కలిగి ఉండటంతో మనం ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. ముఖ్యంగా ముడతలు అందాన్ని దాచి పెడతాయి.

Also Read: Nag Ashwin: కల్కి డైరెక్టర్ లవ్ స్టోరీ.. ఒక్క మాటతో ప్రియాంకని ప్రేమలో పడేసాడట..!!

వయస్సును పెంచేస్తాయి. కాబట్టి సరైన ఆహారం తీసుకుంటే ముడతలు తగ్గుతాయి. అవకాడో లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ ఈ, సీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలాస్టిసిటి ని పెంచి ముడతలు మాయం చేస్తాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.(Skin)

బొప్పాయి తింటే చర్మం మెరుస్తుంది. ముడతలు తగ్గుతాయి. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని విటమిన్ ఏ, సీలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఆకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. వాల్ నట్స్, బాదం పప్పుల్లో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ది చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతాయి. గింజలు తింటే ఆరోగ్యంగా ఉండోచ్చు.

క్యారెట్ లో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఎలాస్టిసీటిని పెంచుతుంది. ముడతలను మాయం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆకుకూరలు తింటే చర్మం మెరుస్తుంది. దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రి రాడికల్స్ తో పోరాడుతాయి. వృద్ధాప్య సమస్యను దూరం చేస్తాయి. ఇవి మీరు కూడా తప్పకుండా పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి.