Postal scheme: ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఆదా చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంపాదనలో కొంచెం డబ్బులను ఆదా చేసుకుంటూ ఉంటారు చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోస్టల్ స్కీమ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టి ఎక్కువ లాభాలను పొందుతున్నారు. గత కొంతకాలంగా అంటే కోవిడ్ తర్వాత నుండి ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువైంది వీటిలో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది.

Get Rs.10 lakhs with Rs.555

హెల్త్ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లస్ అనే పాలసీలను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. 18 నుండి 65 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు ఈ పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ తీసుకోవచ్చు. ఇందులో మూడు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ప్రీమియంలను బట్టి బెనిఫిట్స్ వస్తాయి. ఏడాదికి టాక్స్ లతో కలిపి 355 ప్రీమియం చొప్పున చెల్లిస్తే ఐదు లక్షల బీమా కవరేజ్ వస్తుంది. పాలసీదారుడు ప్రమాదం లేదా శాశ్వత వైకల్యం వలన ఇబ్బందిని ఎదుర్కొంటే 100% కవరేజ్ వస్తుంది పిల్లల పెళ్లిళ్ల కోసం 50,000 వస్తుంది. ఎముకలు పెరిగిన సమయాల్లో 25000 వస్తాయి.

Also read: Health: ఎండు ద్రాక్షాలు పొరపాటున కూడా ఈ వ్యక్తులు తినరాదు..!

హెల్త్ ప్లస్ ఆప్షన్ రెండు విషయానికి వచ్చేస్తే బీమా కవరేజీ 10 లక్షలు గా ఉంది. దీనికోసం మీరు 55 చెల్లించాల్సి ఉంటుంది. 100% కవరేజీ అందుకోవచ్చు. బోన్స్ విరిగిన సమయంలో 25000 కవరేజ్ వస్తుంది. యాక్సిడెంట్ మెడికల్ రీయంబర్స్మెంట్లో లక్ష వరకు వస్తుంది పిల్లలు చదువులు కోసం 50,000 వస్తాయి. మూడవ ఆప్షన్ వచ్చేసి 755. దీనితో మీరు 15 లక్షల బెనిఫిట్ ని పొందవచ్చు 100% బీమా అందుకోవచ్చు పిల్లల పెళ్లిళ్లు కోసం గరిష్టంగా లక్ష వరకు కవరేజ్ వస్తుంది. ఎముకలు విరిగితే 25000 కవరేజ్ చేస్తుంది. ఇతర బెనిఫిట్స్ అన్నీ కలిపి ఆప్షన్ టూ లో ఉన్నట్లు ఉంటాయి. మొత్తం 755 చెల్లిస్తే సరిపోతుంది (Postal scheme).