T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ కు ఒక్క అడుగు దూరంలోనే టీమిండియా ఉంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసిన టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్ళింది. ఇక ఇవాళ సాయంత్రం 8 గంటల సమయంలో టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. T20 World Cup 2024

Threat of rain for the final If the match does not take place who will be the winner T20 World Cup 2024

ఈ మ్యాచ్ బార్బడస్ వేదికగా జరగబోతుంది. దీంతో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా అలాగే టీమిండియా జట్లు… బార్బడాస్ కు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 70 శాతం వరకు వర్షం పడే ఛాన్సులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. T20 World Cup 2024

Also Read: Rohit Sharma: ఫైన‌ల్స్‌ కు టీమిండియా… రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్లు.. ఓదార్చిన కోహ్లి

ఒకవేళ ఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ భారీ వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడినా కూడా… ఇబ్బంది లేదని క్రీడా విశ్లేషకులు తెలుపుతున్నారు. శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం కూడా నిర్వహిస్తారు. అంటే ఫైనల్ మ్యాచ్కు రిజర్వుడే ఉందన్నమాట. T20 World Cup 2024

ఇక రిజర్వుడ్ అయిన ఆదివారం రోజున కూడా వర్షం పడితే… మరొక పద్ధతి కూడా ఉంటుంది. శనివారం అలాగే ఆదివారం కూడా భారీ వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే… సౌత్ ఆఫ్రికా మరియు టీమిండియాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అంటే అప్పుడు టి20 ప్రపంచ కప్ 2024 విజేతలుగా టీమిండియా అలాగే సౌత్ ఆఫ్రికా జట్టు… ప్రకటించబడతాయి. అయితే… వర్షం అంతరాయం కాకుండా… మ్యాచ్ సజావుగా జరుగుతే టీమిండియా విశ్వవిజేత అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. T20 World Cup 2024