Bitter gourd: చాలామంది కాకరకాయ అంటే ఇష్టంగా తింటారు.కానీ కొంతమందికి మాత్రం కాకరకాయ అంటే నచ్చదు. కాకరకాయ చేదుగా ఉంటుందని మరికొందరు ఇష్టపడరు. కాకరకాయను మీరు పొరపాటున కూడా తినకూడదంట..ఎందుకంటే..కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. ఇది చేదుగా అనిపించవచ్చు కానీ చాలా వ్యాధులను దూరం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ బెస్ట్ మెడిసిన్. దీన్ని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇది ఘగర్ కే కాదు మలబద్ధకం, గుండె, బరువు తగ్గడం, కోలెస్ట్రాల్ నివారణకు కూడా మేలు చేస్తుంది.

Do you know any people who should not eat bitter gourd

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్ స్టీట్యూట్ చీఫ్ డైటీషియన ప్రియా పరివాల్ మాట్లాడుతూ కాకరకాయను తినటం చాలా ప్రయోజనకరం…అయితే కొంతమంది ఆరోగ్యానికి హానికరం..ఎవరైనా ప్యాటి లివర్ వంటి కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నవారు కాకరకాయను తినటం వలన ఆరోగ్యానికి హానిని కలిగించే అవకాశం ఉంది. లివర్ లో ప్రోటిన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. గర్భిణీ స్త్రీలు కూడా కాకరకాయను తిన కూడదు. ఎందుకంటే కాకర గింజలలో ఉండే మెమోర్చరిన్ పుట్టబోయే పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

Do you know any people who should not eat bitter gourd

కొన్ని సందర్భంలో కాకరకాయ పిల్లలకు విరేచనాలు, వాంతుల బారిన పడేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎక్కువగా కాకరకాయను పెట్టవద్దు. మధుమేహం వ్యాధిగ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తినకూడదు. షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. దీనితో హిమోలిటిక్ అనీమియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ కాకరకాయని గర్భిణీ స్త్రీలు అసలు తినవద్దు. పొట్ట ఉబ్బరంగా ఉన్నవాళ్లు కాకరకాయని అసలు తినకూడదు. తినటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ఏ సమస్య ఉన్నవాళ్లు అయినా కాకరకాయని తినకుండా ఉండటమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కానీ కొంతమంది ఆరోగ్యానికి మంచిది. పైన చెప్పిన వాళ్లు మాత్రం తినవద్దు.