2025 Kia Seltos: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల కార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కార్లు కొనుగోలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్ల కంపెనీలు తక్కువ ధరలో రకరకాల వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే మన ఇండియాలో కూడా చాలా రకాల కార్లు తక్కువ ధరలు లభిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియా కార్లు ఇండియాలో కూడా విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. 2025 Kia Seltos

2025 Kia Seltos Unveiled in the US with Mild Updates

ఇలాంటి నేపథ్యంలో తాజాగా కియా నుంచి సరికొత్త కారు వచ్చింది. అయితే ఈ కారు అమెరికాలో రిలీజ్ అయింది. 2025 కియా సేల్టోస్ కారును లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా ఈ కారు త్వరలోనే డిఫరెంట్ యాంగిల్ తో… లాంచ్ చేయబోతున్నారట. మరి కియా నుంచి రిలీజ్ అయిన ఈ కారు… ఫీచర్స్ అలాగే ధర వివరాలు తెలుసుకుందాం. 2025 Kia Seltos

Also Read: Muvi 125 5G: మార్కెట్ లోకి క్రేజీ ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్..!

ఈ కారులో 10.25 ఇంచుల డిజిటల్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఇక డ్రైవర్ దగ్గర ఉన్న సైడ్ పవర్ విండో స్విచ్ కోసం… సరికొత్తగా ఆటోమేకర్ అందిస్తున్నారు. ఇక 17 ఇంచుల అల్లాయ్ వీల్స్…కూడా మనకు అందిస్తున్నారు. 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. 2025 Kia Seltos

ఇక ఈ కారు 146 బిహెచ్పి పవర్, 179 ఎన్ఎం టార్క్ ను కూడా రిలీజ్ చేస్తుంది. ఇక అమెరికాలో ఈ కారు ధర 25,090 us డాలర్స్. అంటే మన ఇండియా డబ్బుల ప్రకారం 20 లక్షలకు పైగా ఈ కారు రేటు ఉంటుంది. ఇందులో టాప్ మోడల్ కారు 26 లక్షల వరకు పడుతుంది. 2025 Kia Seltos