Lawrence introduced the successor

Lawrence: సీనియర్ యాక్టర్స్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కాంచన 3, రుద్రుడు, చంద్రముఖి 2, స్టైల్ ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి పాపులారిటీని సంపాదించుకున్నాడు. తాజాగా చంద్రముఖి 2 మూవీలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును దక్కించుకున్నాడు రాఘవ లారెన్స్. డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే..సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అలాగే..ఈయన గొప్ప మనసు గురించి కూడా అందరికీ తెలిసింది.

అనాధ పిల్లలకు, ఎంతోమంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా తనకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే..రాఘవ లారెన్స్ తన కొడుకు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఏ తండ్రి అయినా వారసత్వంగా కొడుకుకు ఆస్తులు ఇస్తారు. కానీ రాఘవ మాత్రం తన సేవ గుణాన్నీ కొడుకుకు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొడుకు చదువుకుంటూ.. పార్ట్ టెం జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులను పేదలకు ఉపయోగిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..అతనికి మీ ఆశీస్సులు కావాలంటూ లారెక్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాన్స్..నేను నాటిన విత్తనం ఇప్పుడు ఉదారమైన అబ్బాయిగా ఎదిగింది.

Lawrence introduced the successor

అతను శ్యామ్, ప్రస్తుతం కాలేజీలో 3 వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ లో కూడా పని చేస్తున్నాడు. 10సంవత్సరాల నుండి నేను హెప్సి బా చదువు కోసం ఆమెకు మద్దతు ఇస్తున్నాను. రాయపురానికి చెందిన ఈమె చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు హెప్సిబా కోసం శ్యామ్ ఈ ఏడాది స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఆనంద క్షణాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. శ్యామ్ సేవ యాత్రకు మీ అందరి ఆశీస్సులు కావాలి ‘అని చెప్పుకొచ్చాడు. ప్రెసెంట్ రాఘవ లారెన్స్ పోస్ట్ వైరల్ అవుతుండగా..నెట్టింట ప్రశ్నలు కురిపిస్తున్నారు నేటిజనులు.