Surya kumar Yadav: టీ 20 ప్రపంచకప్‌ 2024 టోర్నమెంట్‌ విజేతగా టీమిండియా చరిత్ర సృస్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌ పై ఇంకా కొందరు నాన రచ్చ చేస్తున్నారు. బౌండరీ దగ్గర సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ టీ20 వరల్డ్ కప్ ఇండియాకు దక్కేలా చేసిందని చెప్పవచ్చును. అయితే ఇది క్యాచ్ కాదంటూ సిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొత్తగా అనుమానాలు సృష్టిస్తున్నారు. ఫైనల్ లో మిల్లర్ క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా పట్టాడు. Surya kumar Yadav

Suryakumar Yadav Takes T20 World Cup Winning Catch On Boundary

అది అంపైర్ రివ్యూలోను అవుట్ అని తేలింది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వర్గం కొత్త అనుమానాలను వ్యక్తం చేస్తుంది. వేరే యాంగిల్ లో ఉన్న వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ చూడండి అక్కడ సూర్య కుమార్ యాదవ్ కాలు కొంచెం బౌండరీని టచ్ చేసింది అంటూ పోస్టులు పెడుతున్నారు. అదే నిజమైతే టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడం ఒక ఫేక్ అంటూ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు. Surya kumar Yadav

Also Read: Team India: పెను ప్రమాదంలో చిక్కుకున్న టీమిండియా..ఇక కష్టమేనా?

ఇలా సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పై సరికొత్త వివాదం మొదలైంది. అయితే దీనిపై క్లారిటీ ఇండియా వారు ఇస్తే ఎవరు నమ్ముతారు. అందుకే సౌత్ ఆఫ్రికా వారు ఇస్తేనే బాగుంటుంది కదా. అదే కోవలో సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పుల్లోక్ ను దీని గురించి పాకిస్తాన్ రిపోర్టర్లు ప్రశ్నించగా….. ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అద్భుతం. అతను బౌండరీ లైన్ ను టచ్ చేయలేదు. Surya kumar Yadav

అది సిక్స్ కాదు… క్యాచే. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని షాన్ పుల్లోక్ స్పష్టం చేశారు. ఫైనల్లో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా టీమ్ కు చెందిన మాజీ ప్లేయరే ఇలా సూర్య క్యాచ్ ను మెచ్చుకోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాష్ లో ఎలాంటి డౌట్ లేదంటూ లేదు. అది ఖచ్చితంగా అవుటే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. Surya kumar Yadav