Chicken: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రజెంట్ కాలంలో చాలామంది ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వారికి నచ్చిన ఆహారాన్ని తింటూ అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారు. ఇక చాలామందికి నాన్వెజ్ అంటే విపరీతంగా ఇష్టం ఇందులో భాగంగా చాలా మంది చికెన్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మటన్ కాదని చికెన్ ఎక్కువగా తిన్నట్లయితే అనారోగ్యం వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ తినడం వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. చికెన్ తినడం వల్ల అది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా అల్సర్, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. Chicken

Are you eating more chicken than mutton But are you in danger

ఇక చాలామంది చిన్నపిల్లలు కూడా చికెన్ ఇష్టంగా తింటారు. ఇక ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చికెన్ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు విపరీతంగా పెరిగి గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చికెన్ ఎక్కువగా తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. స్త్రీ లకు థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. Chicken

Also Read: Realme C63: Realme నుంచి 9 వేలకే క్రేజీ ఫోన్..ఫీచర్లు ఇవే!

ఎందుకంటే ప్రస్తుతం కోళ్ళని నేచురల్ గా కాకుండా ఇంజక్షన్స్ వేసి పెంచుతున్నారు. దానివల్ల అనేక రకాల సమస్యలు రావడంతో పాటు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. చాలామంది వారానికి రెండు, మూడు సార్లు అయినా చికెన్ తింటూ ఉంటున్నారు. అలా తినడం మంచిది కాదని, కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ తినాలని వారానికి రెండుసార్లు మటన్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది చికెన్ ని వివిధ రకాలుగా వంటకాలు చేసుకొని తింటున్నారు. Chicken

బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, కబాబ్స్, లాలీపాప్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసుకొని తింటున్నారు. ఇలా తినకూడదని…. కేవలం కూర వండుకొని మాత్రమే తినాలని వైద్య నివేదికలో వెల్లడైంది. ఇక ప్రతి ఒక్కరూ చికెన్ వల్ల వచ్చే నష్టాలను తెలుసుకొని ఎక్కువగా తినకపోవడం మంచిది. కేవలం వారానికి ఒకసారి మాత్రమే తినాలి. ఇక మరి నాన్ వెజ్ ఎక్కువగా తినాలని అనిపిస్తే మటన్ ని తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. మటన్ తిన్నవారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. Chicken