KTR: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నేడు గ్రేటర్ ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్ తో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వ బోతున్నారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నారు. శనివారం జరగనున్న జిహెచ్ఎంసి సాధారణ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

KTR meeting with Greater corporators

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాల గురించి మండలిలలో చర్చించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నారు.అదే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు రాజ్యాంగంలో పదో షెడ్యూల్ కు కట్టుబడి ఉన్నామని అంటూ ఇతర పార్టీలలో గెలిచిన వాళ్లని కాంగ్రెస్లో చేర్చుకుంటానని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటున్న రాహుల్ మాటలను దేశం ఎలా నమ్ముతుందని ఆయన అడిగారు. రాహుల్ కి మేనిఫెస్టో పై చిత్ర శుద్ధి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కోరారు.

Also read: Nagarjuna: ఇల్లు వదిలి వెళ్లిపోయిన నాగచైతన్య.. కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున.?

అలానే కాంగ్రెస్లో చేరిన తర్వాత భారత ఎంపీ కేశవరావు రాజ్యసభకు రాజీనామా చేయడానికి స్వాగతిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా వెళ్ళబోతున్నారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి కేటీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి అంశాలు చర్చించబోతారు అనేది తెలియాలంటే కాసేపు ఆగాలి. శనివారం జరగనున్న జిహెచ్ఎంసి సాధారణ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే (KTR).