Director Shankar gave an interesting update

Director Shankar: డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాడు.కమల్ హాసన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తాజాగా కల్కి మూవీలో ఒక రూల్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి కూడా తెలిసింది. అలాగే రీసెంట్గా ‘భారతీయుడు 2’ సినిమా కి డైరెక్టర్ గా ఉన్నారు.

హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ‘భారతీయుడు-2’ ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంతో అద్భుతంగా నటించారని, అలాంటి నటుడు ఈ దేశంలో కాదు…ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని దర్శకుడు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ ముగిసిందని..ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని డైరెక్టర్ చెప్పారు.

Director Shankar gave an interesting update

అనంతరం వెంటనే గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుందని ‘భారతీయుడు-2’ ఫ్రీ రిలీజ్ వేడుకలు శంకర్ చెప్పారు. ఇదిలా ఉండగా..గేమ్ చేజర్ చిత్రంలో ఎస్ జే సూర్య అద్భుతంగా నటించారని తెలిపారు. ఈ సినిమాలో కూడా ఎస్ జే సూర్య మెయిన్ రోల్ లో నటించారని చెప్పుకొచ్చారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా గేమ్ చేంజెర్ చిత్రంలో ఫోర్ రోల్ చేశారని డైరెక్టర్ శంకర్ చెప్పారు.