Smart Phones in July

Mobile Hang: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వలన అనేక లాభాలు ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది కూడా. మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతే ఏం చేయాలి అనే దానికంటే హ్యాంగ్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చూడాలి. మొబైల్ ఫోన్ తరచుగా హ్యాంగ్ అయిపోతుంటే ఈ ట్రిక్ తో పరిష్కరించొచ్చు. ముందు హ్యాంగ్ అయిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా కుదరకపోతే హ్యాంగ్ అయిపోయినట్లయితే ఇలా ఈ టిప్స్ ని పాటించడం మంచిది. అప్పుడు ఫోన్ హ్యాంగ్ అయిపోవడం తగ్గుతుంది.

Mobile Hang problem solution

స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయిపోవడానికి ఒక్క కారణం అంటూ ఉండదు అనేక కారణాల వలన ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మీ ఫోన్లో ర్యం నిండిపోయిన లేదంటే అవసరమైన దానికంటే ఎక్కువ యాప్స్ రన్ చేసి ఉంటున్న ఫోన్ అప్డేట్ చేయకపోయినా ఇలా రకరకాల కారణాల వలన ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.. సాఫ్ట్ స్మార్ట్ ఫోన్ ని ప్రారంభించేటప్పుడు అది నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. అయితే కంపెనీలు ప్రతి ఏడాది కొత్త ఓఎస్ అప్డేట్లను బయటకు వస్తూ ఉంటాయి. ఓఎస్ అప్డేట్ తో పాటుగా కంపెనీలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లని కూడా విడుదల చేస్తాయి. ఈ అప్డేట్లు స్మార్ట్ ఫోన్ పనితీరుని మెరుగుపరుస్తాయి ఈ అప్డేట్లను విస్మరించే చాలా మంది వినియోగదారులు ఉన్నారు. తర్వాత ఫోన్ తీరని ప్రభావితం చేయడం మొదలవుతుంది.

Also read: Modi: మోదీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ..!

ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి కారణం అవుతుంది. అనవసరమైన యాప్స్ ని ఇన్స్టాల్ చేసే వినియోగదారులు చాలామంది ఉన్నారు. అనవసరమైన యాప్స్ కారణంగా కూడా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ఫోన్లో యాప్స్ ని అప్డేట్ చేయకపోతే ఫోన్ హ్యాంగ్ అవడం మొదలవుతుంది ర్యామ్ నిండినప్పుడు కూడా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. ర్యామ్ నిండినప్పుడు ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట అయితే పైన చెప్పినట్లు పాటించకపోయినా లేదంటే పైన చెప్పినవి ఫాలో అయ్యి కూడా ఫోన్ హ్యాంగ్ అవుతున్న ఫోన్ రీసెట్ చేయొచ్చు కానీ మీ ఫోన్లో ఫోటోలు వీడియోలు వంటి వర్క్ ఫైల్స్ ఇటువంటివి ముందే సేవ్ చేసుకుని తర్వాత రీసెట్ చేయండి ఇలా చేస్తే ఫోన్ హ్యాంగ్ అవ్వదు (Mobile Hang).

Smart Phones in July