Budget 2024: కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీములను అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టింది. గతంలో కంటే బీజేపీకి మెజారిటీకి తగ్గిన క్రమంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలను మళ్లీ తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రధాన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ గ్రామీణ గృహ పథకానికి భారీగా సబ్సిడీ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 23వ తేదీన ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్లో గ్రామీణ హౌసింగ్ స్కీంకు సబ్సిడీ కేటాయింపుకు 50 శాతం మేర పెన్షన్ ఉందని సమాచారం. అయితే ఈసారి గ్రామీణ గృహ పథకానికి ఏకంగా 55 వేల కోట్ల కేటాయించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Budget 2024 Modi government big decision

గత అధిక సంవత్సరం 2023-24 లో రూరల్ హౌసింగ్ స్కీంకు కేంద్ర ప్రభుత్వం 32 వేల కోట్ల సబ్సిడీ అందించింది ఇప్పుడు దానిని 55 వేల కోట్లకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడే లక్షల మందికి ఉపాధి కల్పన అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం అధిక కేటాయింపులు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

Also read: Mobile Hang: మొబైల్ ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతోందా..? అయితే ఇలా చేయండి..!

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించునున్నట్లు రూరల్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభమైన 2016 తర్వాత భారీ మొత్తంలో కేటాయింపులు పెంచడం ఇదే మొదటి సారి అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీము కింద గడిచిన ఎనిమిదేళ్లలో 2.6 కోట్లను మంజూరు చేసింది. కేంద్రం ఇటీవలే మరో మూడు కోట్లు ఇల్లు ప్రకటించింది వచ్చే బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మరింత మంది పేద ప్రజలను ఈ హౌసింగ్ స్కీం పరిధిలోకి తీసుకురావాలని చూస్తోంది కేంద్రం (Budget 2024).