Budget 2024: కేంద్ర ప్రభుత్వం మనకరా కళా స్కీములని అందిస్తోంది. చాలా మందికి ఈ స్కీములు బాగా ఉపయోగపడుతున్నాయి. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో తీసుకొచ్చింది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ శుభవార్త అందించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేయాలని చూస్తోంది. అలాగే ఈ పథకం పరిమితి పది లక్షలకు పెంచాలని చూస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు ఒక్కొక్క కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పరిమితిని ఐదు నుండి 10 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

Budget 2024 major change

ఆయుష్మాన్ భారత్ స్కీం లో చేరి హెల్త్ కార్డు తీసుకున్న వాళ్లకి ప్రతి ఏడాది పది లక్షల బీమా సౌకర్యం లభించునుంది. ఈ మేరకు జూలై 23న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు ఈ ప్రతిపాదనలకు కేంద్ర మామోదం తెలిపినట్లైతే ప్రతి ఏడాది అదనంగా 12 వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అధికారులు ఈ విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని దేశంలో మూడింటి రెండువంతులు మంది ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు.

Also read: SLBC Meeting: ఈరోజు బ్యాంకర్ల కమిటీ సమావేశం…!

ఫిబ్రవరి 1 నుండి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 12 కోట్ల కుటుంబాలకు విస్తరించి ఉన్నట్లు ప్రకటించింది. 7200 కోట్లు దీనికోసం కేటాయించింది. 70 ఏళ్ల వయసు పైబడిన వారికి సైతం అందించబోతున్నట్లు జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభలో ఉద్దేశించిన ప్రసంగించిన సందర్భాల్లో ప్రకటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంతో మరో నాలుగు ఐదు కోట్లు ఈ పథకంలో చేరుతాయని తెలుస్తోంది (Budget 2024).