Motorola Edge 50 Pro: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు 4జి ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతే నేటి కాలంలో 5జి ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే రావడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro Vanilla Cream Colour Option Launched in India

ఇక తాజాగా ఈ ఫోన్ నుంచి మరొక కలర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో అనుబంధ సంస్థ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో మరొక కలర్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఇన్ని రోజులు మనకు లుక్స్ లావెండర్, బ్లాక్ బ్యూటీ, మూన్ లైట్ పెరల్ అనే మూడు కలర్లలో అందుబాటులో ఉండేవి. ఇక ఇప్పుడు తాజాగా వనిలా క్రీమ్ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. Motorola Edge 50 Pro

Also Read: iQOO Z9 5G: iQOO Z9 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్…ఏకంగా 8 వేలు ఆఫర్ ?

ఇక ఈ ఫోన్లో ఫీచర్స్ విషయానికి వస్తే ….8జిబి ర్యామ్ విత్ 256 జిబి స్టోరేజ్ వేరియంట్ తో రూ. 31,999…. 12 జిబి ర్యామ్ విత్ 256 జిబి స్టోరేజ్ వేరియంట్ తో రూ. 35,999 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యుఐఓఎస్ వర్షన్ పై పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్లో 6.7 అంగుళాల 1.5 కే పోలేడ్ కర్వ్డ్ డిస్ప్లే ను అమర్చారు. హెచ్ డి ఆర్ + మద్దతుతో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144 హెర్ట్జ్ రిఫ్రేష్ రేటు ఈ ఫోన్ సొంతం. Motorola Edge 50 Pro

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక ఇందులో ఫోటోలు, వీడియోల కోసం 15 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 125 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇక ఫోన్ కొనుగోలు చేయాలని ఆసక్తితో ఉన్నవారు ఈ కలర్ లో తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ను ఈఎంఐ సదుపాయంలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల బ్యాంకు కార్డులు వాడినట్లయితే డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Motorola Edge 50 Pro