Oneplus watch 2: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల వలన కలిగే ఉపయోగాలు ఇన్నీ అన్నీ కావు. రోజు రోజుకి మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా వస్తున్నాయి. వినియోగదారులని ఆకట్టుకోవడానికి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్లకి కూడా డిమాండ్ బాగా ఉంది. ప్రస్తుతం స్మార్ట్ వాచ్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది వన్ ప్లస్ వాచ్ టు పై భారీ డిస్కౌంట్ ని అందిస్తున్నారు. వన్ ప్లస్ వాచ్ 2 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. వన్ ప్లస్ వాచ్ టు అసలు ధర వచ్చేసి 27,999. అమెజాన్ పే బ్యాలెన్స్ తో పే చేస్తే 719 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 2000 దాకా డిస్కౌంట్ వస్తుంది.

Oneplus watch 2 in discount

గరిష్టంగా 6000 వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు వన్ ప్లస్ వాచ్ టు ఫీచర్ల గురించి చూస్తే 1.43 ఇంచెస్ తో కూడిన డిస్ప్లే ఇచ్చారు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను కూడా ఇచ్చారు దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. పవర్ సేవర్ మోడ్ ని ఇందులో ప్రత్యేకంగా ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్తో తీసుకొచ్చిన ఈ వాచ్ 60 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Also read: AC Problem: వర్షాకాలంలో ఈ చిన్న పొరపాటు వలన ఏసీలో సమస్య…!

2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ ని దీనికి ఇచ్చారు. ఫోర్ ఆపరేటింగ్ సిస్టంతో ఇది పని చేస్తుంది. స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మోనిటరింగ్, హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఇచ్చారు. అదిరే ఫీచర్లతో ఇలా వన్ ప్లస్ వాచ్ టు అందర్నీ ఆకట్టుకుంటుంది పైగా ఇప్పుడు డిస్కౌంట్ లో తక్కువకే దీనిని కొనుగోలు చేయొచ్చు. కాబట్టి ఎక్కువ మంది వాచ్ పై ఆసక్తి చూపిస్తున్నారు (Oneplus watch 2 ).