Green Light: మొబైల్ ఫోన్స్ లో తరచుగా గ్రీన్ లైట్లు కొన్ని ఐకాన్లు కనిపిస్తాయి. వీటిని మీరు ఎప్పుడైనా గమనించారా..? కొన్ని ప్రత్యేక ఆప్షన్స్ ని తెరిచినప్పుడు మాత్రమే ఈ చిహ్నాలు కనిపిస్తాయి. ఈ సూచికలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫోన్లో ఏ సెన్సార్లు చురుకుగా ఉన్నాయో అవి మీకు తెలియజేస్తాయి. హ్యాకర్ల రహస్య ప్రవేశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తారు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లేదా ఐఫోన్ లో మీరు స్క్రీన్ పై చాలా చిన్నగా గుర్తులను గమనించవచ్చు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ లేదా ఐఫోన్ లో మీరు స్క్రీన్ పై చాలా చిన్న నోటిఫికేషన్ లైట్లను గమనించి ఉండక పోయి ఉండొచ్చు. ఈ లైట్లు అన్ని సమయాల్లో కనపడవు. కానీ మీరు వాటిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చూస్తారు. బహుశా మీరు వీటిని ఎప్పుడు పట్టించుకుని ఉండరు.

Green Light symbol on mobile phone

ఈ నోటిఫికేషన్ లైట్లు మీ గోప్యతకు సంబంధించినవి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా గ్రీన్ లైట్ కనబడుతుంది. కెమెరా లేదా మైక్ ఆన్ లో ఉన్నప్పుడు ఈ లైట్ కనబడుతుంది కొన్ని ఫోన్లలో లైట్ లు కనపడితే కొన్ని ఫోన్లలో ఈ లైట్లు ఈ లైటులతో పాటు ఐకాన్స్ కూడా కనిపిస్తాయి. మీరు తెరిచినా యాప్ మీ సెన్సార్లలో ఏది ఉపయోగిస్తుందో ఇది మీకు తెలుపుతుంది. వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి గూగుల్ దీన్ని తీసుకొచ్చింది.

Also read: Bigg Boss beauty: ప్రేమలో మునిగితేలుతున్న తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ప్రియుడుతో కలిసి అలా..!

ఫోన్ కెమెరాను ఆన్ చేసినప్పుడు మీకు స్క్రీన్ ఎక్కువ భాగంలో గ్రీన్ లైట్ లేదా కెమెరాతో పాటు గ్రీన్ లైట్ కనబడచ్చు. అంటే మీరు ఓపెన్ చేసిన యాప్ ఫోన్ కెమెరాని ఉపయోగిస్తుందని అర్థం. ఇలా మీరు కొన్ని ఉపయోగించేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు గ్రీన్ లైట్ తో కూడిన మైక్ కనబడుతుంది. యాప్ స్మార్ట్ ఫోన్ మైక్ ని ఉపయోగిస్తుందని ఈ సిగ్నల్ సూచిస్తుంది. జీపీఎస్ లేదా ఇతర స్థాన సెన్సార్ ఉపయోగంలో ఉన్నప్పుడు స్క్రీన్ పై మ్యాప్ గుర్తును చూస్తారు. ఈ ఐకాన్ సహాయంతో మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ అనుమతి లేకుండా ఈ సెన్సార్లు యాక్టివ్ గా ఉంటే హ్యాకర్లు మీ ఫోన్ ని హ్యాక్ చేశారని అర్థం (Green Light).