These are the green drinks that make the skin bright

Green drink: చాలామంది చర్మం కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమంది చర్మం మాత్రం కాంతివంతంగా ఉండదు. మచ్చలు, ముడతలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ చర్మం కాంతివంతంగా మార్చే గ్రీన్ డ్రింక్స్ ఇవే!. పాలకూర, యాపిల్ప కీరదోస మూడు కలిపి జ్యూస్ లా చేసి తాగొచ్చు. దీనిని రెగ్యులర్ గా తాగటం ద్వారా చర్మం అందంగా మారుతుంది. తద్వారా స్కిన్ గ్లో వస్తుంది. కాలే, పైనాపిల్ లో డ్రింక్ లో అల్లం కలిపి తాగటం ద్వారా చర్మం డిటాక్సిఫై అవుతుంది. ఇది చర్మం ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. అలాగే స్కిన్ కాంతివంతంగా మారుతుంది.

మచ్చ, బనానా, బాదం గింజల పొడి కలిపి చేసే డ్రింక్ తాగటం ద్వారా మీకు యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ ఇ లభిస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. పార్స్ లే, సిలెరి జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం ద్వారా మీ బాడికి కావాల్సిన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలోవెరా, కీరదోస, సీలెరి లో చర్మానికి మెరుపుదనం అందించే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేసి కాంతివంతంగా మారుస్తాయి. గ్రీన్ పెప్పర్, కివీ, లైమ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

These are the green drinks that make the skin bright

ఇవి చర్మాన్ని నేచురల్ గా కాంతివంతం చేయటంలో సహాయపడతాయి. పాలకూర, బొప్పాయి డ్రింక్ లో కొద్దిగా కొబ్బరి పాలు కలిపి తాగటం చాలా మంచిది. వీటిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పపైన్ ఎంజైమ్ చర్మానికి అదనపు మెరుపు అందిస్తాయి. బ్రోకోలి, పియర్ జ్యూస్ లో కొద్దిగా కొబ్బరి నీళ్లు కలిపి తాగటం ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతో మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి కాంతివంతంగా చేస్తాయి. కివి జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం ద్వారా మీ బాడీకి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, లభిస్తాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ జ్యూస్ ను మీరు కూడా తాగి మీ చర్మాన్ని అందంగా మార్చుకోండి.