Amazon Prime Day Sale: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీ చేయడం మొదలు పెట్టడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఆన్లైన్ షాపింగ్ ని ఇష్టపడుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్లిప్కార్ట్ అమెజాన్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ని నిర్వహిస్తున్నాయి. అమెజాన్ సేల్స్ సమయంలో కొన్ని ఉత్పత్తులను నమ్మలేని తగ్గింపుతో ఆఫర్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆయా సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Amazon Prime Day Sale will be soon

తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 20 నుండి 21 వరకు అనేక డీల్స్ కొత్త లాంచ్లతో సేల్ నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఈ సెల్ లో సాంసంగ్, మోటోరోలా, వన్ ప్లస్ మొదలైన ఫోన్లపై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డులు ఎస్బిఐ క్రెడిట్ కార్డులు తో ఈఎంఐ లావాదేవీలు ఉపయోగించి చేసిన చెల్లింపులు పై 10 శాతం పొదుపు పొందవచ్చు.

Also read: Vijashanti: పాలిటిక్స్ లోకి వస్తే ఒక్క రోజుకే సీఎం అవుతారా.. పెద్ద ముసుగు దొంగ.. చిరంజీవి పై విజయశాంతి ఫైర్.?

24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ని కూడా పొందవచ్చు. ప్రైమ్ డేస్ లో భాగంగా చాలా ఫోన్లు ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సేల్స్ లో సాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ అందుబాటులో ఉంది. ఇది జూలై 17న లాంచ్ అవ్వబోతోంది అలానే ఐక్యూ నైన్ లైట్ ఫైవ్ జి కూడా లాంచ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో వన్ ప్లస్ నార్డ్ సి ఈ ఫోర్ లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. లావా బ్లేజ్ ఎక్స్ ఫోనుని కూడా ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ జూలై 10 న లాంచ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ డే సెల్స్ లో హానర్ 200 సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోను జూలై 18న లంచ్ అవ్వబోతోంది (Amazon Prime Day Sale).