Google Map: ఈరోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా, కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా సరే అడ్రస్ తెలియకపోయినా పర్వాలేదు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని మనం ఎక్కడికి వెళ్లాలనుకున్న ఈజీగా వెళ్లొచ్చు. డిజిటల్ యుగంలో గూగుల్ మ్యాప్స్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. మనం తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ మనకు తోడుగా మారిపోతుంది. దీని నావిగేషన్ సేవ మీరు ఏ ప్రాంత ప్రదేశానికి చేరుకోవాలో సహాయపడుతుంది. కావాలంటే మీరు మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి అవుతుంది. మీ ఇల్లు, ఆఫీసు, షాప్ చిరునామని ఇందులో యాడ్ చేసుకోవచ్చు.

Google Map Location adding

అది మీరు ఎలా అని ఎప్పటినుండో అనుకుంటున్నారా అయితే ఇప్పుడే చూసేయండి. ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఇంటికి చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ లో మీ ఇంటి చిరునామని నమోదు చేయాలి. మీరు మీ ఇంటి చిరునామని గూగుల్ మ్యాప్ కి జోడించినట్లయితే మీరు మీ ఇంటి చిరునామని మళ్లీ మళ్లీ నమోదు చేయక్కర్లేదు. మీ చిరునామని నేరుగా ఎంచుకోవచ్చు. మీరు ఉన్న ప్రదేశం నుండి మీ ఇంటికి మార్గం రూపొందించబడుతుంది. అప్పుడు మీరు నావిగేషన్ ద్వారా సులభంగా మీ ఇంటిని చేరుకోవచ్చు. గూగుల్ యాప్స్ మ్యాప్ ని ఓపెన్ చేసి గూగుల్ ఖాతాను నిర్వహించడం లోకి వెళ్లండి. ఇక్కడ నుండి మీరు నేరుగా గూగుల్ ఖాతాకు వెళ్తారు గూగుల్ ఖాతాకు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చిరునామాలు ఎంపికను పొందుతారు. ఇల్లు ఆఫీసు ఇతర చిరునామాల్లో ఏదైనా ఎంపికైన ఎంచుకోవచ్చు.

Also read: Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది..!

మీరు దుకాణం లేదా కార్యాలయం చిరునామని జోడించాలనుకుంటే మీరు వ్యాపార ప్రొఫైల్ ను సృష్టించాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లో షాప్ లేదా ఆఫీస్ చిరునామాను యాడ్ చేస్తే బిజినెస్ అడ్రస్ అంటారు. ఈ చిరునామాను గూగుల్ మ్యాప్స్ కి ఎలా జోడించొచ్చాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి యాప్ దిగువన కాంట్రిబ్యూట్ ఎంపికను ఎంచుకోవాలి. సో అలానే జోడించడం ద్వారా వ్యాపారం ఆప్షన్ పై నొక్కండి. క్రోమ్ బ్రౌజర్ కి వెళ్తారు. వ్యాపారం పేరు వ్యాపార వర్గం మొదలైన వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి తర్వాత ఓటిపి వస్తుంది. అది కూడా ఎంటర్ చేయండి. ఇలా మీరు వ్యాపార చిరునామాని గూగుల్ మ్యాప్స్ కి జోడించడానికి అవుతుంది. ఎవరైనా అక్కడికి చేరుకోవడం సులభంగా ఉంటుంది (Google Map).