Home Loan: హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి బ్యాంకులు అన్యాయంగా విధిస్తున్న చార్జీలు అలాగే వడ్డీ లెక్కింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం తీవ్రంగా స్పందించింది. ఫెయిర్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ ని ఈమేరకు విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హోమ్ లోన్ కస్టమర్లకు అందించిన రోజు నుండే వడ్డీ విధించాల్సి ఉంటుంది. బ్యాంకులో లోన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి వడ్డీ రేట్లు విధించడాన్ని తప్పు పట్టింది ఈ మేరకు ఇటీవల నిర్వహించిన వార్షిక తనిఖీల్లో భాగంగా బ్యాంకులో అన్యాయమైన పద్ధతిలో రుణ ఆగ్రహితులపై భారం మోపుతున్నాయని చెప్పింది.

Home Loan new rule from RBI

ఈ క్రమంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త రూల్స్ నేపథ్యంలో బ్యాంకులు చార్జీలను సైతం తగ్గించాయి. ఏ బ్యాంకులో ఎంతెంత ఛార్జీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ ప్రాసెసింగ్ ఫీజు ని చాలా తగ్గించింది రుణం మొత్తం పై 0.35% ప్లస్ జీఎస్టీ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ బ్యాంకులో కనీస చార్జీలు 2000 నుండి గరిష్టంగా 10,000 ప్లస్ జీఎస్టీ ఉన్నాయి.

Also read: Google Map: గూగుల్‌ మ్యాప్స్‌లో ఇల్లు, ఆఫీసు, షాపును ఎలా నమోదు చేయాలి…?

ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే ఈ బ్యాంకు లోన్ అమౌంట్ పై ఒక శాతం ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తోంది. కనీస చార్జీలు 7,500 నుండి మొదలవుతున్నాయి. ప్రీ పేమెంట్ చేసినట్లయితే రెండు శాతం మీద పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. దాంతో పాటుగా ఇతర టాక్స్ లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీ లోన్ మొత్తం పై 0.50% నుండి రెండు శాతం వరకు వసూలు చేస్తోంది. గరిష్టంగా 3 వేల వరకు ఏది ఎక్కువ అయితే అది చెల్లించాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే మొత్తం రుణం పై 0.5% వడ్డీ అందిస్తోంది ఆ పైన వర్తించే టాక్స్లు చెల్లించాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణ మొత్తం పై ఒక శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో గరిష్టంగా రెండు శాతం ప్లస్ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది (Home Loan).