Jio PrePaid Plans: ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫాలను ఉపయోగిస్తున్నారు. పైగా ఇంటర్నెట్ లేని ఫోను అంటూ ఏదీ లేదు. ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ ని అధికంగా వాడుతున్నారు. అయితే ఇంటర్నెట్ ని వాడుకోవాలంటే తప్పక బ్యాలన్స్ వేయించుకోవాలి. రిలయన్స్ జియో ఇటీవల టారిఫ్‌ను పెంచింది. ప్రీపెయిడ్‌కు సంబంధించి ప్లాన్లను తీసేయడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు కొత్త ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ యాడ్ ఆన్ ప్లాన్లను కంపెనీ తీసుకు రావడం జరిగింది. అయితే ఇవి విడిగా ఉండవు. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్‌కు యాడ్-ఆన్‌గా వాడుకోవడానికి అవుతుంది. మరి ఇక వీటిని సంబందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం.

Jio PrePaid Plans details

రిలయన్స్ జియో తీసుకువచ్చిన కొత్త ప్లాన్ల గురించి చూసేస్తే.. వినియోగదారుల ఆదరణ బాగుంటుందని కంపెనీ భావిస్తోంది. 1 జీబీ, 1.5 జీబీ డేటా ప్లాన్లను రీచార్జి చేసుకున్న యూజర్ల కోసం ఈ బూస్టర్ ప్లాన్లను కంపెనీ తీసుకు వచ్చింది. అధిక డేటా కోసం రీచార్జి చేసుకునే వాళ్లకు ఉపయోగం ఉంటుంది. కొత్త ప్లాన్ల ధరలను రూ. 51, రూ. 101, రూ.151 గా నిర్ధారించింది. ఈ ప్లాన్ల ద్వారా అపరిమిత 5జీ డేటా ని పొందేందుకు అవుతుంది. సాధారణంగా 2 జీబీ, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకున్న వారికి ఇప్పటికే అపరిమిత 5జీ డేటా అందుతున్న విషయం తెలిసిందే.

Also read: Chandra babu: ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..!

రూ.151 ప్లాన్ ద్వారా అధిక వేగంతో 9 జీబీ వరకూ 4జీ డేటా లభిస్తుంది. 5 జీ మద్దతు ఉన్న ఫోన్లకు అధిక వేగంతో అపరిమిత 5జీ డేటా వస్తుంది. అదే రూ.101 ప్లాన్ అయితే 6 జీబీ వరకూ 4జీ డేటా ఇస్తారు. అలాగే 5జీ ఫోన్లకు అపరిమిత 5జీ డేటా ని ఇస్తారు. రూ.51 ప్లాన్.. విషయానికి వస్తే.. 3 జీబీ వరకూ 4జీ డేటా వినియోగదారులకు అందుతుంది. 5 జీ ఫోన్లు ఉన్న వారికి అపరిమిత 5 జీ డేటా అందిస్తారు. అపరిమిత 5జీని అందించే రూ. 1559, రూ. 359 ప్లాన్ల ను కంపెనీ ఈ మధ్యే తీసేసింది (Jio PrePaid Plans).