Curd: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రతిరోజు చాలామంది భోజనం తినే సమయంలో చివరికి పెరుగు వేసుకుని తింటూ ఉంటారు. అలా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్పడం మనం వింటూనే ఉన్నాం. అయితే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చివరకు పెరుగు వేసుకొని రెండు ముద్దలు అయినా తినాలని….దానివల్ల కడుపులో చల్లగా ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా పెరుగు వేసుకొని తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపులో మంట, వికారం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. Curd

Health Benfits With Curd

అందువల్లనే ప్రతి ఒక్కరూ పెరుగుని తప్పకుండా తినాలని చెబుతారు. కానీ మధ్యాహ్నం కాకుండా రాత్రి సమయంలో పెరుగు అస్సలు తీసుకోకూడదని…..రాత్రి సమయంలో పెరుగుతో తిన్నట్లయితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని….అంతేకాకుండా ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పెరుగు తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుందని…. పెరుగులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో ఆ కొవ్వు పదార్ధం శరీరంలో నిల్వ అవుతుంది. Curd

Also Read: Jagan: జగన్ మెడకు చుట్టుకుంటున్న తోపుదుర్తి కక్కుర్తి స్కామ్ లు.. ఏకంగా 200 కోట్లు.?

తద్వారా ఇది చాలా సులువుగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు అస్సలు తీసుకోకూడదు. రాత్రిపూట కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుతున్నట్లయితే కీళ్లలో దృఢత్వం తగ్గిపోయి…. నొప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. Curd

ఇక ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రాత్రి సమయంలో పెరుగు అస్సలు తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ మహిళలు కూడా రాత్రి సమయంలో పెరుగు అస్సలు తినకూడదు. ప్రెగ్నెన్సీ మహిళలు రాత్రిపూట పెరుగు తిన్నట్లయితే కడుపులోని బిడ్డకు శ్వాస సరిగ్గా అందకపోవచ్చు. దానివల్ల కడుపులోని బిడ్డకు అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పెరుగు తినేవారు కేవలం మధ్యాహ్నం మాత్రమే తినాలని…. రాత్రి సమయంలో అస్సలు తినకూడదని వైద్య నివేదికలో వెళ్లడైంది. Curd