Pani puri: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. తద్వారా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా బయటి ఆహారాన్ని తిని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది పానీపూరిని ఇష్టంగా తింటూ ఉంటారు. Panipuri

Are you eating panipuri but tasmat is it a guarantee of getting cancer

వాటిని అస్సలు తినకూడదని ….దాని ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని ఓ ప్రాంతంలో దుకాణాల్లో విక్రయించే పానీపూరీల నాణ్యతపై అనేక రకాల ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం పానీపూరీలు విక్రయించే అన్ని రకాల దుకాణాలు, హోటళ్లలో పానీపూరీలను సేకరించిన ఆహార భద్రతశాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. వీటిలో క్యాన్సర్ కు కారణమయ్యే సింథటిక్ పిగ్మెంట్లు ఉన్నట్టు తెలిసింది. Panipuri

Also Read: Jagan: జగన్ కోసం రంగంలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?

చాలా రకాల పానీపూరీలు అమ్ముడు అవుతాయి. ముఖ్యంగా కర్ణాటకలో గోబీ మంచూరియన్, కబాబ్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలలో క్యాన్సర్ కు కారణమయ్యేటువంటి కృత్రిమ కలర్స్ ను వాడుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కెమికల్స్ ముఖ్యంగా బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్, సన్ సెట్ ఎల్లో వంటి కలర్స్ ఎక్కువగా వాడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఫుడ్ కలర్స్ క్యాన్సర్ కు కారణం అవుతాయని తెలియజేశారు. Panipuri

అందుకే బయట లభించే ఆహారాన్ని అస్సలు తినకూడదని కేవలం ఇంట్లో తయారు చేసుకొని మాత్రమే ఆహారాన్ని తినాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు జ్వరం, టైఫాయిడ్, మలేరియా, జలుబు, దగ్గు, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు, అల్సర్ వంటి వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. Panipuri