Samantha: Have you made a big mistake in your life by missing Naga Chaitanya

Samantha: సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి పెద్ద తప్పు చేశాను అని బాధపడుతుందా. ఆమె అవి ముళ్లదారులు, నిప్పుల బాటలు అంటూ ఎందుకు మాట్లాడింది.. ఇంతకీ సమంత మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత ఎక్కువ రోజులు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయారు. నాలుగు సంవత్సరాలకే డివోర్స్ తీసుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక పెళ్లయ్యాక సమంతకి ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి.

Samantha: Have you made a big mistake in your life by missing Naga Chaitanya

అయితే విడాకులు ఏ కారణంతో తీసుకున్నారో తెలియదు కానీ విడాకుల తర్వాత మాత్రం సమంత ఎంతో బాధ అనుభవించింది.మయోసైటిస్ వ్యాధితో పాటు అందరూ మాట్లాడే సూటిపోటి మాటలతో సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అలా చాలా రోజులు ఆ వ్యాధిలోని ఉండిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో రాణిస్తోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన విడాకుల తర్వాత జరిగిన రోజుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.(Samantha)

Also Read: Tamannaah: బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిన తమన్నా.. మరో వ్యక్తితో ఎఫై**.?

ఓ ఇంటర్వ్యూలో సమంతకి మీరు జీవితంలో ఏదైనా మార్చగలగాలి అనుకుంటే దేన్నీ మారుస్తారు అని ప్రశ్న ఎదురవగా..నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుండి నిప్పుల బాటలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే మన జీవితం మనకు ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయాలి. ఇక నేను రీసెంట్ నా ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నా జీవితంలో ఏం జరిగిందో అది జరగకపోయి ఉంటే బాగుండేది అని చెప్పాను. కానీ మన లైఫ్ లో ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది కదా. గత మూడు నాలుగేళ్లలో నేను అనుభవించిన ఇబ్బందులు నాకు అవసరమా అనిపించింది.

Samantha: Have you made a big mistake in your life by missing Naga Chaitanya

కానీ నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే నేను ఏదీ మార్చాలి అనుకోలేదు.ఏ కష్టం వచ్చినా కూడా దానితో పోరాడి అందులో నుండి బయటపడి గెలవాలి.అంతేకాదు నేను ఇన్ని రోజుల నుండి నిప్పుల బాటలో నడిచాను. దాంతో నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో సమంత మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి చాలా బాధపడుతుంది అందుకే ఆమె అలాంటి మాటలు మాట్లాడింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)