Junnu: జున్ను అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అయితే ప్రస్తుత కాలంలో జున్ను ఎక్కువగా లభించడం లేదు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉండేవి. ఆవు లేదా గేదె ప్రసవించిన సమయంలో మొదటిసారిగా వచ్చే పాలతో జున్నును తయారు చేస్తారు. సాధారణ పాలను కూడా బాగా మరగకాచి జున్నును తయారు చేయవచ్చు. ఈ జున్నులో పాలలో కన్నా అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయి. జున్ను వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే దానిని ఎవ్వరూ వదిలిపెట్టరు. ఈ జున్నులో కాల్షియం, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ జున్నుపాలు కండరాల బలానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. Junnu

Amazing Benefits of Eating Junnu

సన్నగా ఉండేవారు జున్ను తింటే చక్కగా లావు అవుతారు. ఇది శరీరానికి కావలసిన ఎనర్జీని అందించడంతోపాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. మరీ ముఖ్యంగా దంతాలు, ఎముకల బలానికి సహాయపడుతుంది. తరచుగా జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు జున్నుపాలను తిన్నట్లయితే సమస్య సులభంగా తీరుతుంది. జున్ను పాలలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. Junnu

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యకు 95 కోట్ల భారీ నష్టం ?

అయితే ఈ జున్నును ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనెను కలుపుకొని తిన్నట్లయితే కడుపులోని శిశువు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. మెదడు పనితీరును అభివృద్ధి చేస్తుంది. బాలింతలకు పాలు సరిగ్గా పడని వారు జున్ను తినడం వల్ల పాలు పడతాయి. అంతేకాకుండా జున్ను తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. జున్ను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. Junnu

అందుకే ఎలాంటి ఆహార పదార్థాన్ని అయినా మోతాదుకు మించి తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా జున్ను తింటే గుండెపైన ప్రభావం పడుతుంది. గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారంలో ఒక్కసారి మాత్రమే జున్నుని తినాలని…. అంతకుమించి తిన్నట్లయితే అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. Junnu