Janhvi Kapoor: సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవర చిత్రం పార్ట్ 1 కోసం అభిమానులు ఎంతగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఫియర్’ సాంగ్ ఊహించిన దానికంటే పెద్ద చార్ట్ బస్టర్ అయింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఎన్టీఆర్ అభిమానులను ఇంకా అలరిస్తుంది. ఇక మిగతా పాటలను మరింత ఉన్నత స్థాయిలో చేస్తాడని సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండో లిరికల్ సాంగ్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ఆ పాటకు సంబందించిన పనులు పూర్తి కాకపోవడంతో ఆ ప్రకటన పెండింగ్‌లో పడింది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor about devara movie update

దేవర సినిమా తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది జాన్వీ కపూర్‌. ఇది ఆమె అభిమానులను ఎంతో ఉత్సాహంగా ఉంచే విషయం. తెలుగులోకి శ్రీదేవి వారసురాలిగా వస్తున్న జాన్వీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్లతో కలిసి రావడం ఆమె కు కెరీర్ పరంగా ఇక్కడ మంచి అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.అలాగే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోయే సినిమా కోసం జాన్వీ ను ఎంపిక చేస్తున్నారని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి కానీ దానిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “దేవర” సినిమా విడుదలైన తర్వాత మరో ఏడాదిలో “దేవర 2” ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్..?

ఇక ప్రస్తుతం జాన్వీ తన బాలీవుడ్ చిత్రం ‘ఉలాజ్’ ప్రమోషన్స్‌లో దేవర సినిమా ను గురించి ఓ విషయాన్నీ పంచుకుంది. మొదటి లుక్ ఇప్పటికే ఆకట్టుకోగా తాజాగా ఆమె పాత్ర మొదటి భాగంలో కంటే రెండో భాగం లో ఎక్కువగా ఉంటుందని చెప్పింది. దీన్ని బట్టి మొదటి పార్ట్ లో పాటలో గానీ,ఓ సీన్ లో గానీ కనిపిస్తుందని, సీక్వెల్ లో ఆమె పెర్ఫార్మెన్స్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని అర్థమవుతోంది.ఇక దీనిపై ఆమె మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఇక Jr.NTRతో కలిసి చేసిన డ్యాన్స్‌ను చాలా ఎంజాయ్ చేశానని ఆమె చెప్పింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె ఇటీవలే డిశ్చార్జ్ అయింది. మిగితా పోర్షన్ ను త్వరలోనే పూర్తి చేస్తానని ఆమె వెల్లడించింది.