Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి… కాలేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ ఇష్యూ వివాదంగా మారింది. దాదాపు లక్ష కోట్లు పెట్టి.. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు కేసీఆర్. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో…. సాగులో లేని భూమి కూడా సాగులోకి వచ్చింది. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైనది చెప్పవచ్చు. Revanth Reddy

Madigadda blow to CM Revanth Reddy KCR rising again

అయితే అలాంటి కాలేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న మూడు పియర్స్ ఎన్నికల కంటే ముందు కుంగిపోయాయి. దీంతో కాలేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి… అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పాటు కాలేశ్వరం ఇష్యూ గురించే మాట్లాడి… అక్కడ రిపేర్ చేయలేదు. Revanth Reddy

Also Read: Jagan: జగన్ కు బిగ్ షాక్… వైసీపీకి వైవీ సుబ్బారెడ్డి దూరం ?

మూడు పియర్స్ కుంగిపోతే.. మేడిగడ్డ మొత్తం కుప్పకూలుతుందని ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇప్పుడు మహారాష్ట్ర, అదిలాబాద్ లాంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. ఈ తరుణంలోనే మేడిగడ్డ బ్యారేజ్ వెంట… కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు… ఏపీకి వెళ్తోంది. Revanth Reddy

భారీ స్థాయిలో వరద వచ్చిన కూడా మేడిగడ్డ మాత్రం కుంగ లేదు వంగ లేదు. పటిష్టంగా చాలా దృఢంగా ఉంది మేడిగడ్డ ప్రాజెక్ట్. దీంతో గులాబీ పార్టీ… మేడిగడ్డకు త్వరలోనే వెళ్ళనుంది. అక్కడ జరిగిన వాస్తవాలను చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసేందుకు నిర్ణయం తీసుకుంది కేసీఆర్ పార్టీ. దీంతో రేవంత్ రెడ్డి ఇరుకున పడ్డారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. Revanth Reddy