KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొట్టమొదట.. గవర్నర్ ప్రసంగం ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇవాళ గవర్నర్ ప్రసంగం అయిన… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడతాయి. అలాగే.. బుధవారం లేదా గురువారం రోజున తెలంగాణ బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. KCR

Madigadda breathed life to KCR

ఈ సారి కూడా తెలంగాణ బడ్జెట్ పూర్తి స్థాయిలో పెడతారా ? లేదా ఓటాన్ అకౌంట్ పెడతారా ? అని అందరిలోనూ ఓ చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో… గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బడ్జెట్ పెట్టే రోజు అసెంబ్లీలో అడుగు పెట్టాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. KCR

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు?

భారీ వరద వచ్చినా కూడా మేడిగడ్డ నిలబడడంతో కెసిఆర్ కు ఊపిరి పోసినట్లు అయింది. దీంతో అసెంబ్లీ వేదికగా మేడిగడ్డ… విషయాన్ని… క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారట. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా… అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారట. KCR

ఇన్ని రోజులుగా కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారట. అందుకే… నేరుగా బడ్జెట్ పెట్టే రోజున కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాల్టి రోజున గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ లతో సమావేశం కానున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై వారితో చర్చించనున్నారు కేసీఆర్. KCR