Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… శత్రువులుగా జగన్మోహన్ రెడ్డి అలాగే టిడిపి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రఘురామకృష్ణ రాజు అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య పూర్తిగా వాతావరణం చల్లబడింది. Jagan

Raghurama Comments on jagan

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణరాజు ఇద్దరూ ఒకే దగ్గర.. కూర్చున్నారు. ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకున్నారు. గత ఐదు సంవత్సరాల పాలన అలాగే ప్రస్తుత పరిస్థితులను ఇద్దరు చర్చించుకున్నారట. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే ఆడియో వైరల్ గా మారింది. Jagan

Also Read: Jagan: జగన్ కోసం రంగంలోకి రాహుల్ గాంధీ..?

అయితే ఇలాంటి నేపథ్యంలో… రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ని తిట్టానని.. ఇకపై జగన్మోహన్ రెడ్డిని రెస్పెక్ట్ తో పిలుస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. గతంలో తనను అరెస్టు చేయడం అలాగే… చంపడానికి ప్రయత్నించాడని జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టానని రఘురామకృష్ణరాజు. Jagan

ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చున్నారు. తనకు జగన్ అంటే ఎలాంటి కోపం లేదని.. ఇకపై ఆయనను గౌరవప్రదంగా పిలుస్తానని రఘురామరాజు వెల్లడించారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం పై రఘురామరాజు అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అంటున్నారు. మంత్రి పదవి లేదా స్పీకర్ పదవి ఇస్తారని రఘురామకు చంద్రబాబు ఆశ చూపించి… హ్యాండ్ ఇచ్చారట. దీంతో ఇలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. Jagan