KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో… కేంద్రంలో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చర్చ జరిగింది. ఏపీకి భారీగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు… గులాబీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. KCR

Revanth Reddy, KCR hunger strike in Delhi

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాటం చేసేదని… కానీ కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలో.. గెలవడం వల్ల బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని గులాబీ పార్టీ చెబుతోంది. అయితే కేంద్ర బడ్జెట్ పై.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. కేంద్రానికి వ్యతిరేకంగా.. తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. KCR

Also Read: Jagan: జగన్ తో కాళ్ళ బేరానికి వచ్చిన రఘురామ..?

ఈ సందర్భంగా చర్చ కూడా పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీష్ రావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ధర్నాలు చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేయడంతో.. కాంగ్రెస్ కూడా సిద్ధమని తెలిపింది. KCR

ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఎప్పుడు మేమే దీక్షలు చేస్తున్నామని ఇప్పుడు రేవంత్ రెడ్డి.. దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో దీక్ష చేస్తే నేను కూడా సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే కేసీఆర్ను తీసుకురండి ఢిల్లీకి వెళ్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై కలవకుండా చంద్రశేఖర రావు ఎలా స్పందిస్తారో చూడాలి. KCR