IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే ఆధరనే వేరు. ప్రపంచమంతటా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ లీగ్ ను ఇష్టపడతారు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా మన వారితో కలిసిపోయి క్రికెట్ సంబరంలో పాల్గొంటారు. మ్యాచులు కూడా అదే రేంజ్ లో రసవత్తరంగా సాగుతాయి. ఇండియాలో ఐపీఎల్ కు వున్న క్రేజే వేరు. టీమిండియా మ్యాచ్ లతో పోలిస్తే ఈ క్రికెట్ మ్యాచ్ లకు అభిమానులు మరింత ఎక్కువగా తరలివస్తారు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న ఐపీఎల్ తర్వాతి టోర్నీకి చాలా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే దీనిపై చర్చలు మొదలయ్యాయి. IPL 2025

New rules in IPL 2025 6 players at once

ఐపీఎల్ మెగా వేలంలో కొన్ని నిబంధనలు ఖరారు అయ్యాయని తెలుస్తోంది. జూలై 31న ఫ్రాంచైజీలు ఐపీఎల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత కొత్త రూల్స్ ను ప్రకటించనున్నారని సమాచారం. అయితే మునుపటిలాగా కాకుండా ఈసారి మెగా ఆక్షన్ కాస్త భిన్నంగా కొనసాగుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ నిర్వహకుల ముందు కొన్ని ఫ్రాంచైజీలు ఊహించని విధంగా డిమాండ్లు పెట్టాయి. కనీసం ఆరుగురు ప్లేయర్లకు రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోరాయి. IPL 2025

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కోసం ఆస్తి రాసిస్తానంటున్న హీరోయిన్ ?

దానితోపాటు నలుగురు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేలా అవకాశం ఇవ్వాలని ఐపీఎల్ నిర్వాహకులు ప్రతిపాదించారు. అయితే దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించలేదు. అలా చేస్తే వేలంపై ఆసక్తి ఉండదని భావిస్తోంది. కానీ ఫ్రాంచైజీలకు అనుకూలించే కొత్త నిబంధనలను చేర్చనున్నారు. 90 కోట్ల శాలరీ క్యాప్ ను 130 కోట్ల నుంచి 140 కోట్ల రూపాయలకు పెంచనున్నారు. అంటే ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ భారీగా పెరగనుంది. మెగా వేలాన్ని ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. దీని గురించి సమావేశంలో చర్చించి సానుకూలంగా నిర్వాహకులు స్పందించే అవకాశం ఉంది. IPL 2025

అయితే మూడు నుంచి నాలుగేళ్లకు మాత్రమే పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ .. భావిస్తోంది. కానీ రైట్ టు మ్యాచ్ కార్డు గురించి ఐపీఎల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనివల్ల కొన్ని సానుకూలతలు, ప్రతికూలతలు ఉండడంతో బీసీసీఐ ఆలోచిస్తోంది. రైట్ టు మ్యాచ్ కార్డు వల్ల ప్లేయర్లకు మంచి జరగనుంది. మార్కెట్ విలువకు తగ్గట్టుగా ప్లేయర్లకు ధర పలుకుతుంది. కీలకమైన ఆటగాళ్లను నిలుపుకునేందుకు ఫ్రాంచైజీలు భావిస్తే….ఇతర ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగా ఆ ప్లేయర్ల ధరను అమాంతం పెంచే ఛాన్స్ లేకపోలేదు. మరి త్వరలోనే జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. IPL 2025