Raj Tarun father's shocking comments on Lavanya

Raj Tarun: రాజ్ తరుణ్ లావణ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారినట్టు రోజుకొక కొత్త క్యారెక్టర్ మీడియా ముందుకు వచ్చి ఎన్నో సంచలన విషయాలు బయట పెడుతున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మాల్వి మల్హోత్రాతో పాటు లావణ్య తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే మాల్వి మల్హోత్రాపై కేసు పెడుతూ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి లావణ్యకు మద్దతుగా నిలిచింది. ఇక రాజ్ తరుణ్ కి మద్దతుగా ఆయన ఫ్రెండ్ యూట్యూబర్ అయినటువంటి ఆర్ జె భాషా కూడా వీరి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి లావణ్య గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఇలా రోజుకొక క్యారెక్టర్ ఎంట్రీ తో వీరి గొడవ రోజురోజుకు రసవత్తరంగా మారిపోతుంది.

Raj Tarun father’s shocking comments on Lavanya

అయితే తాజాగా వీరి గొడవలోకి రాజ్ తరుణ్ తండ్రి కూడా ఎంట్రీ ఇచ్చారు.రీసెంట్ గా రాజ్ తరుణ్ ఫ్రెండ్ యాంకర్ ఆర్ జె భాషా లావణ్యతో గొడవ పెట్టుకున్న ఆడియో కాల్ వైరల్ అయింది. అయితే యూట్యూబ్ ఛానల్లో ఆర్ జే భాష పాల్గొని రాజ్ తరుణ్ కి మద్దతుగా మాట్లాడుతున్న సమయంలో యాంకర్ ఒకసారి రాజ్ తరుణ్ తండ్రికి కాల్ చేయండి అని చెప్పగా లైవ్ లోనే ఫోన్ చేశాడు. దాంతో రాజ్ తరుణ్ తండ్రి బయట పెట్టిన నిజాలకు అందరి మైండ్ బ్లాక్స్ అవుతున్నాయి. ఇక రాజ్ తరుణ్ తండ్రి ఏం మాట్లాడారు అంటే.. (Raj Tarun)

Also Read: Shree Rapaka: ఒంటిమీద బట్టలు లేకపోతే ఆ డైరెక్టర్ నన్ను వదిలేవాడు కాదు.!

లావణ్య చాలా సంవత్సరాల నుండి నాకు తెలుసు. వారిద్దరి మధ్య రిలేషన్ ఉన్నది నిజమే.ఓ టైంలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అదే సమయంలో లావణ్య నిజస్వరూపం కూడా బయటపడింది. ఆమె రోజుకొకడిని ఫ్లాట్ కి తీసుకువచ్చి గోల గోల చేసేది. ఎవరెవరో వస్తూ ఉండేవారు. ఇక ఆమె బిహేవియర్ నచ్చని రాజ్ ఆమెకు దూరం అవ్వాలి అనుకున్నాడు. అలాగే వ్యసనాలకు కూడా బానిసయ్యింది.ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. దాంతో రాజ్ ఆమెకు దూరం అవ్వాలని అనుకున్నాడు.

Raj Tarun father's shocking comments on Lavanya

ఇక మేము అప్పుడప్పుడు రాజ్ ని చూడడానికి వెళ్ళినా కూడా మమ్మల్ని మనుషులకంటే హీనంగా చూసేది. రాజ్ తరుణ్ తల్లితో ఆమె తిన్న ప్లేట్స్ కడిగించేది. దాంతో మేం అక్కడి నుండి అవమానంతో తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పుడు రాజ్ తరుణ్ దూరం అవ్వడంతో ఆమె విలాసాలకు డబ్బులు దొరకడం లేదని మళ్లీ తనతోనే కలిసి ఉండాలని,ఆమె చెప్పినట్టే రాజ్ వినాలని ఇదంతా రచ్చ చేస్తుంది.. అంటూ రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు లైవ్ లోనే మాట్లాడారు.(Raj Tarun)