Samantha Adult Series with Raj and DK

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా బాలీవుడ్ చిత్రాల పైన, అక్కడి వెబ్ సిరీస్ లపైనే ఉంచిందని చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలలో వెబ్ సిరీస్లలో ఏవి కూడా దక్షిణాదికి సంబంధించిన ప్రాజెక్టులు లేవు. ఆ విధంగా దక్షిణాది నుంచి వెళ్లి అక్కడ పాతుకపోయినా ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఓ మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఆ వ్యాధి రాకుండా ఉంటే ఈపాటికి దేశవ్యాప్తంగా టాప్ హీరోయిన్ల లిస్టులో ఉండేది కాబోలు. దీపిక పడుకొనే, ప్రియాంక చోప్రా రేంజ్ లో సమంత దూసుకుపోయేది.

Samantha Adult Series with Raj and DK

ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చినా కూడా అనారోగ్యం కారణంగా నటించలేకపోయింది. ఏడాదిన్నరకు పైగా ఆమె వ్యాధితో బాధపడుతుండగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఆగస్టు ఒకటవ తేదీన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా పోస్ట్ చేశారు. అదేంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. దేని గురించి అన్నది కూడా ఎవరికి తెలియదు. కానీ ఇందులో సమంత నటిస్తుందని, ఆమె నటించబోయే కొత్త చిత్రం ఇదే అని ఇన్సైడ్ గా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: IPL 2025: ఐపీఎల్ లో ఇక కొత్త రూల్స్.. ఏకంగా 6 ప్లేయర్స్ ?

మీర్జాపూర్ లో హీరోగా నటించిన ఫైజల్ అలియాస్ గుడ్డు సరసన ఓ చిత్రంలో నటించబోతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ‘తుంబాద్’ దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉండగా రాజ్ డీకే సమంతా గురించే పోస్ట్ వేశారా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే.ఏదేమైనా సమంతకు మార్కెట్ ఇప్పుడు పూర్తిగా లేదనే చెప్పాలి. ఆమె చేసిన పలు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఒక్క ‘ఖుషి’ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తనను నిలబెట్టే సినిమా ఏది అవుతుందో తెలియాలి.