Who is the star Hero who wanted to buy Hyderabad with his first salary

Hero: ఓ హీరో తనకు వచ్చిన మొదటి జీతంతో హైదరాబాద్ ని సగం కొనేయాలనుకున్నారట.. మరి హైదరాబాద్ ని సగం కొనే అంత జీతం ఆ హీరో కి వచ్చిందా.. ఆ హీరో కి వచ్చిన మొదటి జీతం ఎంత ఎందుకు హైదరాబాద్ ను కొనాలి అనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మొదటి జీతంతో హైదరాబాద్ సగాన్ని కొనయాలి అనుకున్న హీరో ఎవరు కాదు.. న్యాచురల్ స్టార్ నాని అవును మీరు వినేది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా నాని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.అయితే నాని మొదట ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.ఆయన డ్రీమ్ కూడా డైరెక్టర్ అవ్వాలనే.కానీ అనుకోకుండా అష్టా చమ్మా మూవీతో హీరోగా మారారు.దాంతో డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ పక్కన పెట్టి హీరో గానే కొనసాగుతున్నారు.

Who is the star Hero who wanted to buy Hyderabad with his first salary

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టైర్ -2 హీరోలలో నాని కూడా ఒకరు. ఈయన తన సహజ నటనతో ఎంతో మందిని కట్టిపడేస్తారు.ఎలాంటి ఎమోషన్స్ అయినా రొమాంటిక్ సన్నివేశాలైనా యాక్షన్స్ సన్నివేషాలైనా సరే నాని తర్వాతే ఎవరైనా అనేలా తన నటనతో మంచి మార్కులు సంపాదించారు.అయితే అలాంటి నాని మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సమయంలో ఆయనకు 4000 జీతం వచ్చిందట. ఇదే ఆయన మొదటి జీతం. (Hero)

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కు రిలీజ్ కష్టాలు.. ఓజీ కి తిప్పలే!!

అయితే అప్పట్లో 4000 జీతం పూర్తిగా వంద నోట్లే ఇచ్చారట. ఇక 100 నోట్లు షర్ట్ జేబులో పెట్టుకొని షూటింగ్ ముగించుకొని ఇంటికి బండిమీద తిరిగి వచ్చే సమయంలో చాలా హ్యాపీగా ఫీలయ్యారట.అంతేకాదు తన జీతంతో హైదరాబాదుని సగం కొనేయాలి అనే ఫీలింగ్ పొందారట. ఇక మొదటి జీతం నాలుగు వేలైనా సరే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని, కానీ ఇప్పుడు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నా కూడా మొదటి జీతం అందుకున్నంత సంతోషం ఇప్పుడు లేదు అంటూ నాని తన అభిమానులతో ఈ విషయాన్ని ముచ్చటించారు.

 Who is the star Hero who wanted to buy Hyderabad with his first salary

అలాగే నాకు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం.అందుకే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా అంటూ నాని చెప్పుకొచ్చారు. ఇక నాని గత ఏడాది హాయ్ నాన్న మూవీ తో హిట్ కొట్టారు. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ లో నటిస్తున్నారు.(Hero)