Radish: ముల్లంగి ఇది చూడడానికి చక్కగా ఉంటుంది. కానీ దీనిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. దీని రుచి బెగటుగా ఉండడం వల్ల తినాలనిపించదు. కానీ కొంతమంది మాత్రం దీనిని ఇష్టపడేవారు తరచుగా ముల్లంగిని తింటూ ఉంటారు. ముల్లంగితో సలాడ్, పచ్చడి, సాంబార్, పరాటాలు వంటివి చేసుకొని తింటారు. ఇక వారు ముల్లంగి దుంపలను వంటకు ఉపయోగించుకొని… వాటి ఆకులను వదిలేస్తారు. కానీ ముల్లంగి ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. Radish

Eating or drinking these foods with Radish may turn fatal

ముల్లంగి దుంప కన్నా దాని ఆకుల్లోనే ప్రయోజనాల పుష్కలంగా ఉంటాయని…. ఇందులో పోషకాలు, విటమిన్స్, కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముల్లంగి ఆకులలో షుగర్ కంట్రోల్ చేసేందుకు కావలసిన పోషకాలు ఉంటాయి. ఇది రక్తపోటును నివారించడం నుంచి కాపాడుతుంది. ముల్లంగి ఆకులను తరచుగా వంటకాలలో ఉపయోగించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. నేటి కాలంలో చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు. అలాంటి వారు ముల్లంగి ఆకులను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Radish

Also Read: IPL 2025: ఐపీఎల్ లో ఇక కొత్త రూల్స్.. ఏకంగా 6 ప్లేయర్స్ ?

అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులైన దురద, మొటిమలు, దద్దుర్లు ఇంకా అనేక రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది. మధుమేహం బాధితులు ముల్లంగి ఆకులను తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు ఉండడం వల్ల శరీరంలోని తెల్ల కణాలను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ముల్లంగి ఆకులు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చాలామంది ఫైల్స్ సమస్యతో బాధపడతారు. అలాంటివారికి ముల్లంగి ఆకులు ఒక వరం. వీటిని తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. వీటిలో ఫైబర్, కేలరీలు ఉంటాయి. Radish

చలికాలంలో చాలామందికి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దానివల్ల ఫ్లూ, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి. అలాంటి సమయంలో విటమిన్ సి చాలా అవసరం. ఇక ముల్లంగి ఆకులలో విటమిన్ సి ఉండడం వల్ల వాటిని తప్పకుండా తినాలి. ఇక గ్యాస్ సమస్యతో బాధపడేవారు కూడా ప్రతిరోజు వారి ఆహారంలో తప్పకుండా ముల్లంగి ఆకులను కూర వండుకొని తినాలి. తద్వారా గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా ముల్లంగి ఆకులను తప్పకుండా తినాలి. ఇక చిన్న పిల్లలకు కూడా ముల్లంగి ఆకులను వారంలో రెండు మూడుసార్లు అయినా తప్పకుండా తినిపించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Radish