Chicken skin: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి కాలంలో కలుషిత వాతావరణం కారణంగా ఎలాంటి ఆహారం తినాలన్నా చాలా భయమేస్తుంది. ఇక మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా విటమిన్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఆహారం తినడం వల్ల కొంతైనా మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే ఆహారంలో చికెన్ ఒకటి. వారంలో రెండు సార్లు అయినా చికెన్ తప్పకుండా తింటారు. Chicken skin

Health Issues With chicken skin

చికెన్ తినడం వల్ల అనారోగ్యం అని తెలిసినప్పటికీ దానిని తినకుండా అస్సలు ఉండలేరు. అయితే చికెన్ వారంలో ఒక్కసారి తింటే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. కానీ చికెన్ లివర్ అసలు తినకూడదట. ఇది తినడం వల్ల గుండెపైన, మూత్రపిండాలపైన ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా కోడి చర్మం తినడం అస్సలు మంచిది కాదు. నేటి కాలంలో కోళ్లకు కూడా మందులను వేసి పెంచుతున్నారు. Chicken skin

Also Read: Gautam Gambhir: డేంజర్ జోన్ లో గంభీర్? వైరల్ అవుతున్న శర్మ కామెంట్స్

ఆ మందు అంతా కోడి చర్మం పైన పడుతుంది. దానివల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. చికెన్ స్కిన్ లో అసంతృప్త కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు వంటి సమస్యలు వస్తాయట. ఇక మరీ ముఖ్యంగా కోడి చర్మంలో ఒమేగా 6, కొవ్వులు, చెడు ప్రోటీన్స్ ఉంటాయట. దానిని తినడం వలన గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా చికెన్ స్కిన్ తిన్నవారికి దురద, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి. Chicken skin

అయితే నెలలో ఒక్కసారి స్కిన్ తో కలిపిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని…. అదేపనిగా వారంలో రెండు మూడు సార్లు స్కిన్ తో కలిపి చికెన్ తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ కి కూడా దూరంగా ఉండడం మంచిదట. చిన్నపిల్లలకు కూడా చికెన్ తినిపించకపోవడం మంచిదని చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చికెన్ అసలు తినకూడదు. ఇందులో ఉండే కొవ్వుల కారణంగా థైరాయిడ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారే చికెన్ తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.