Coriander: ప్రతి ఒక్క కూరలో ధనియాల పొడిని తప్పకుండా వేసుకుంటూనే ఉంటాం. అయితే ధనియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ ధనియాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. థైరాయిడ్ ను నియంత్రించడానికి ధనియాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాలు నానబెట్టిన నీటిని తాగినట్లయితే థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. Coriander

Surprising Health Benefits of Coriander

వాత మరియు కఫం వంటి సమస్యల వల్ల కలిగే హార్మోల నుంచి కాపాడుతాయి. ధనియాల నీటిలో ఇనుము, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, విటమిన్లు కూడా ఉండడం వల్ల ధనియాల నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. థైరాయిడ్ సమస్యకు ధనియాలను పలు రకాలుగా తీసుకున్నట్లయితే చాలా మంచిది. ధనియాల నీరు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియకు ఎంతగానో సహాయపడుతుంది. Coriander

Also Read: IPL 2025: IPL 2025కి ముందు ప్రమాదంలో పడ్డ ముంబై ?

ధనియాలను నానబెట్టి నీటిని తాగినట్లయితే కడుపులో ఉపశమనం కలుగుతుంది. ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. పేగు ఆరోగ్యానికి సహాయపడుతోందని వైద్యులను నివేదికలో వెళ్లడైంది. ధనియాల నీరు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధనియాల నీటిని తాగినట్లయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, కెమికల్స్ శరీరంలోని మంటను తొలగిస్తాయి. Coriander

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో ఫ్రీ రాడికల్స్ అనేక వ్యాధుల నుంచి పోరాడి ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఏర్పడే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ధనియాల నీరు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక క్రమం తప్పకుండా ప్రతిరోజు ధనియాల నీటిని తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధనియాల నీటిని తప్పకుండా తాగాలని చెబుతున్నారు. Coriander