Capsicum: క్యాప్సికం తినడానికి చాలామంది పెద్దగా ఇష్టపడరు. కానీ దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికంలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఐరన్ లోపాన్ని తొలగిస్తాయి. రక్తహీనతను నిరోధిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారికి, బరువు తగ్గడానికి క్యాప్సికం అద్భుతంగా పనిచేస్తుంది. Capsicum

Health Benefits of Capsicum

ఇందులో ఊబకాయాన్ని కరిగించే పోషకాలు ఉంటాయి. క్యాప్సికంలో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, ఏసిడిటీ వంటి సమస్యలను తొలగిస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులను తొలగించడానికి క్యాప్సికం చక్కగా పనిచేస్తుంది. ఇందులో లూటీన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. Capsicum

Also Read: Prithvi Shaw: పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న టీమిండియా ప్లేయర్?

అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి క్యాప్సికం సహాయపడుతుంది. దీంతో పాటు రేచీకటి వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. క్యాప్సికం తినడం వల్ల కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె జబ్బులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తినాలి. వారంలో రెండు సార్లు అయినా క్యాప్సికం తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. Capsicum

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. చర్మంపై ఏర్పడే మచ్చలు, ముడతలు వంటి సమస్యలను తొలగిస్తాయి. క్యాప్సికం తినడానికి చిన్నపిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు. అయితే వారికి నెమ్మదిగా క్యాప్సికం తినడం అలవాటు చేసినట్లయితే చిన్నపిల్లలలో ఏర్పడే లోపాలు తొలగిపోయి వారి పెరుగుదల బాగుంటుంది. వారంలో రెండుసార్లు అయినా క్యాప్సికం తినాలని నిపుణులు చెబుతున్నారు. Capsicum