Vegetables: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఔషధ గుణాలు ఉండటం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా ఆకుకూరలు తినాలని చెబుతుంటారు. అయితే దీనిని వర్షాకాలంలో అసలు తినకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. ఇందులో వాస్తవం లేకపోయినప్పటికీ కొంతమేర నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. Vegetables

Are you eating green vegetables in monsoon season

వర్షాకాలంలో ఆకుకూరలు బురదగా మారుతాయి. అలాగే ఈ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా ఆకులపై పేరుకు పోతాయి. వర్షాకాలంలో బ్యాక్టీరియాలో తమ సంతానోత్పత్తిని పెంచుకునే ప్రదేశంగా ఆకుకూరలను మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆకుకూరలను శుభ్రం చేసుకుని తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు. Vegetables

Also Read: Shikhar Dhawan: క్రికెటర్లలో శిఖర్ ధావన్ కొట్టినవాడే లేదు…గబ్బర్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

అంతేగాని ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. వీటిపై పేరుకుపోయే వైరస్ బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల డయేరియా, కడుపులో నొప్పి, ప్లేగు సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలను పూర్తిగా శుభ్రం చేసుకుని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవట. ఆకుకూరలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Vegetables

ఇందుకోసం ముఖ్యంగా ఆకుకూరలను అన్నింటిని వేరు చేయాలి. ఆ తర్వాత ఆకులను ఒక బట్టపై వేసి ఆరబెట్టుకోవాలి. దీంతో తేమ పోతుంది. ఆ తర్వాత ఆకుకూరలను వండే ముందు ఉప్పు వేసిన నీటిలో కొంతసేపు ఉడకబెట్టడం మంచిది. ఆ తర్వాత ఆకుకూరలను వండే ముందు ఉప్పు వేసిన నీటిలో కొంతసేపు ఉడకబెట్టలని చెబుతున్నారు.ఇలా చేస్తే వర్షాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పవట. వారంలో కనీసం రెండు, మూడుసార్లైనా ఆకుకూరలను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని…. మన శరీరంలో ఏర్పడి అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Vegetables