The producer who made shocking comments on Samantha tweet

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత కేరళ తరహా హేమ కమిటీ రిపోర్ట్ మన టాలీవుడ్ లో కూడా రావాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్టు తన సోషల్ మీడియా ఖాతాలో స్టోరీ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టోరీ చూసిన చాలామంది జనాలు టాలీవుడ్ లో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉందా..కానీ సమంత లాంటి పెద్ద హీరోయిన్ ఈ విషయాన్ని బయటికి తీయడంతో సమంతకి నిజంగానే అలాంటి పరిస్థితి ఏమైనా ఎదురయిందా అనే కోణంలో కొంతమంది జనాలు ఆలోచిస్తున్నారు.

The producer who made shocking comments on Samantha tweet

అయితే అంత పెద్ద హీరోయిన్ ఈ విషయం గురించి చెప్పడంతో ఆమెకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో అని చాలామందిని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈమె పెట్టిన ట్వీట్ వైరల్ అవ్వడంతో తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. సమంత ఆ ట్వీట్ ఎందుకు పెట్టిందో మాకు అర్థం అవ్వడం లేదు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది వచ్చిందో తెలియదు.అయితే ఆమె మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉంది కాబట్టి ఆమెకు ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా మా అసోసియేషన్ కి కంప్లీట్ ఇవ్వాలి.(Samantha)

Also Read: Radhika: కారవాన్ లో రహస్య వీడియోలు.. బట్టలు మార్చుకుంటుండగా నగ్న వీడియోలు..?

2019లోనే జీవిత రాజశేఖర్ నేతృత్వంలో ఒక కమిటీని టాలీవుడ్ లో కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా అంతర్గతంగా కంప్లైంట్ చేయాలని వారికి సంబంధించిన పూర్తి విషయాలు చెప్పాక వారిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఇందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు భోజనాలు చెట్టు కింద తినవలసి వస్తుందని డ్రెస్సులు మార్చుకోవడంలో ఇబ్బంది వస్తుందని, షూటింగ్ సెట్లలో వాష్ రూమ్ లకి వెళ్లడానికి ఇబ్బంది వస్తుందని తెలియ జేశారు.

The producer who made shocking comments on Samantha tweet

అలాగే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ఎక్కడైనా సరే ఈ పదం ఉంది.అయితే సినిమాల్లో ఆ క్యారెక్టర్ మనకు సెట్ అవ్వకపోతే తప్పుకోవాలి. కానీ అనవసరంగా వారిలో చెప్పే క్యారెక్టర్ సెట్ అవ్వకపోయినా వారికి లొంగిపోయి వారి కోరికలు తీర్చాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు కోరికలు తీర్చమని వేధిస్తూ ఉంటే చెప్పుతో కొట్టాలి అంటూ నట్టి కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సమంతకి ఏమైనా ఇబ్బంది వస్తే మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేయాలని కూడా మాట్లాడారు.(Samantha)